తెలంగాణ

AP & TG : నైరుతి నిష్క్రమణ.. ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అంచనావేశారు. దీంతో తెలుగు ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ అంచనావేశారు. దీంతో తెలుగు ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎండ తీవ్రత తాళలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఎల్ నినో కారణంగా రెండు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగుకు నీరు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల వైపు ఈశాన్య రుతుపవనాలు వేగంగా దూసుకు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఏపీ, తెలంగాణల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు దంచికొట్టే అవకాశమున్నట్టు అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ మార్పులు, తేమతో కూడిన గాలుల తీవ్రత వల్ల ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.

తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మరోవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతాయని వెల్లడించారు. అక్టోబర్ 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.దక్షిణ, తూర్పు తెలంగాణ పరిధిలోని జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ ప్రాంతాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, రాత్రిపూట స్వల్ప చలి గాలులు కొనసాగుతాయని, 17వ తేదీ తర్వాత ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.ఈశాన్య రుతుపవనాల రాకతో సీజనల్ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

#Whetherman#rains#telangana#Andrapradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి