క్రీడలు

ప్రపంచకప్‌ 2027లో కోహ్లీ, రోహిత్ భాగస్వామ్యంపై బీసీసీఐ స్పష్టత!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

2027వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సీనియర్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రాతినిధ్యంపై నెలకొన్న చర్చకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పష్టతనిచ్చారు. ఆటగాళ్ల వయసు పెరుగుతున్నప్పటికీ, కేవలం వయసును మాత్రమే ఎంపికకు ప్రాతిపదికగా తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.

 2027వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సీనియర్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రాతినిధ్యంపై నెలకొన్న చర్చకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పష్టతనిచ్చారు. ఆటగాళ్ల వయసు పెరుగుతున్నప్పటికీ, కేవలం వయసును మాత్రమే ఎంపికకు ప్రాతిపదికగా తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. మైదానంలో ఆటగాడి ఫిట్‌నెస్, అద్భుతమైన ప్రదర్శనే ప్రధాన ప్రామాణికాలని పేర్కొన్నారు. జట్టు కోసం ఆడుతూ మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్నంత వరకు సీనియర్లు జట్టులో కొనసాగవచ్చని తెలిపారు.

 అయితే జట్టు ఎంపికపై బోర్డు నేరుగా జోక్యం చేసుకోదని, తుది నిర్ణయం పూర్తిగా సెలెక్టర్లు, కోచ్‌ల విచక్షణకే వదిలేస్తున్నట్లు మన్హాస్ స్పష్టం చేశారు. వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కోహ్లీ, రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ల సుదీర్ఘ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. జస్‌ప్రీత్ బుమ్రా వంటి నాణ్యమైన పేసర్లు బౌలింగ్ విభాగాన్ని సమర్థంగా నడిపించగలరని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో సరైన కలయిక ఉంటేనే ప్రపంచకప్ గెలవడం సాధ్యమవుతుందని అన్నారు.

 మరోవైపు మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. దక్షిణాఫ్రికా పిచ్‌లు ప్రస్తుతం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో భారత్ ప్రపంచకప్ కైవసం చేసుకోవాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను మరింత పటిష్టంగా మార్చుకోవాలని సూచించారు. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ల ఫామ్, అనుభవంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సేవలు జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

 ఈ మెగా టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కేవలం సీనియర్ల మీదే కాకుండా, యువ టాలెంట్‌ను కూడా సమర్థవంతంగా ప్రోత్సహించే ప్రణాళికతో ముందుకెళ్తోంది. యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు తమ దూకుడుగా వ్యవహరిస్తూ జట్టులో స్థానం కోసం గట్టి పోటీని ఇస్తున్నారు. సీనియర్లు అందించే విలువైన అనుభవాన్ని, యువ ఆటగాళ్ల దూకుడును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే టీమిండియా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

#BCCIPresidentMithunManhas#ViratKohli#RohitSharma#2027ODIWorldCup#TeamIndiaUpdates#MohammedKaif#CricketNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి