National

National : గేటు దూకి జంతర్‌మంతర్‌లో నిరసనలు.. సీజేపీ నేతల అరెస్టు!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఎస్ఐఆర్‌, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరననలు ఆగడం లేదు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేయడానికి వీల్లేదని నిన్న ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలు ఇవాళ పోలీసుల కళ్లుగప్పి గేట్లు దూకి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.

ఎస్ఐఆర్‌, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరననలు ఆగడం లేదు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేయడానికి వీల్లేదని నిన్న ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలు ఇవాళ పోలీసుల కళ్లుగప్పి గేట్లు దూకి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతాకం చేతబట్టుకొని కొందరు నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ డీసీపీ కార్యాలయానికి లేఖ సమర్పించినప్పటికీ ఇవ్వలేదని తెలిసింది. అయితే, అనుమతులు లేకుండా ప్రదర్శనలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న వెంటనే సౌరవ్ దాస్, రంకాలతో పాటు మరికొందరినీ పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా సౌరవ్ దాస్ ఓ వీడియో విడుదల చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని.. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టొద్దని అంటున్నారని చెప్పారు.అయినప్పటికీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా నిరసన చేస్తామంటూ సవాల్ విసిరారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద నినాదాలు చేస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద పదే పదే నిరసనలు జరుగుతుండటంతో వాహనదారులు,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు బ్యాన్ చేస్తూ ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జంతర్ మంతర్‌కు బదులు రామ్‌లీలా మైదానం, బురాడీ మైదాన్, సీబీడీ గ్రౌండ్‌లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు .ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాక్రోచ్ ప్రతినిధులు తాము జంతర్ మంతర్ వద్దే నిరసనలు చేస్తామని సవాల్ విసిరారు.అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతుండగా వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

#jantarmantar#delhi#cjp protests#arrested#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి