తెలంగాణ

కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి: కిషన్ రెడ్డి

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రజాస్వామ్య హక్కులు, నిరసనల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా నిరసనలు, మార్చ్‌లు చేసుకునేందుకు అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం విపక్ష బీజేపీ నేతల గొంతును ఉక్కుపాదంతో అణచివేస్తోందని మండిపడ్డారు.

 ఒకే దేశంలో రెండు విభిన్న రాజకీయ విధానాలను అవలంబిస్తూ కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసుకుంటోందని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, పోలీసు నియామకాల్లోని జాప్యం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తదితర ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ సిద్ధమైతే.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పలువురు ముఖ్య నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేయడం అత్యంత హేయమైన చర్య అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థను, చివరకు సైన్యాన్ని సైతం బహిరంగంగా విమర్శిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆయన ప్రజాస్వామ్య హక్కులకు అడ్డు తగలలేదని గుర్తుచేశారు. ‘ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మాత్రమే ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయా? తెలంగాణలోని బీజేపీ నాయకులకు ఆ హక్కులు ఉండవా?’ అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

 కేవలం చేతుల్లో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ఊరేగితే సరిపోదని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగ విలువలను, భావప్రకటన స్వేచ్ఛను ఆచరించి చూపాలని హితవు పలికారు. 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లలో మగ్గబెట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీ నైజం ఎప్పటికీ మారదని విమర్శించారు.

#KishanReddy#CongressDoubleStandards#TelanganaBJP#RahulGandhiDelhiProtests#RevanthReddyGovt#TelanganaPolitics2026#BJPNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి