సినిమా

Sandeep Reddy Vanga: వరంగల్ ఏయిర్ పోర్ట్ కి సందీప్ రెడ్డి రెండు పేర్లు..సీఎం రియాక్షన్ ఇదే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sandeep Reddy Vanga: తెలంగాణలోని వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావాలన్న దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ప్రస్తుతం, ఈ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో.. ఈ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత్ప ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి పేరు సూచనలు కోరడంతో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Sandeep Reddy Vanga: తెలంగాణలోని వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావాలన్న దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ప్రస్తుతం, ఈ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో.. ఈ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత్ప ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి పేరు సూచనలు కోరడంతో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన సూచనలు ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన సూచించిన రెండు పేర్లు ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

తన అధికారిక ఎక్స్ ఖాతాలో సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. తన సొంతూరు వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’ అనే రెండు పేర్లను ఆయన సూచించారు. వరంగల్‌కు ఉన్న చారిత్రక ఘనత, కాకతీయుల వారసత్వం, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టుకు పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని వంగా తన పోస్టులో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్టుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేవలం “That’s the Spirit” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ చాలా చిన్నదైనప్పటికీ అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘Spirit’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన స్పందనలో “Spirit” అనే పదాన్ని ఉపయోగించడం సినీ అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది.

#Sandeep Reddy Vanga#CM Revanth Reddy#Trending News#RIA#KIA
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి