తెలంగాణ

Janasena : పేరు,సంతకం లేకుండా ప్రెస్‌నోట్ విడుదల ఏంటి!!

రచన: Kumar5 నిమిషాల పఠనం

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో సుమారు 700 ఎకరాల భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశంపైనా విచారణ జరగాలని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో సుమారు 700 ఎకరాల భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశంపైనా విచారణ జరగాలని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడినట్టు ఓ ప్రెస్‌నోట్ విడుదలైంది. అయితే, ఈ ప్రెస్‌నోట్ ఎవరు విడుదల చేశారు? అతని పేరు, సంతకం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

ఈ ప్రెస్‌నోట్ ఫేక్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహస్‌లోని భూములపై సర్వే జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇందులో డిమాండ్ చేసిన అంశాలు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై, బీఆర్ఎస్ పార్టీ, నేతల మీద కల్వకుంట్ల కవిత, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైనే ప్రధాన డిమాండ్లు ఉండటం గమనార్హం.

ఈ ప్రెస్‌నోట్‌లోని కీలక అంశాలను ఒక్కసారిగా పరిశీలిస్తే.. బీఆర్ఎస్‌కు రూ.1400 కోట్ల నిధులు పార్టీ ఫండ్ రూపంలో రావడం వెనుక ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని, ఈ విషయాన్ని కేసీఆర్ కూతురు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో దీనిపైనా విచారణ జరపాలనే డిమాండ్ ఉంది. అదే విధంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రూ.55 కోట్లను నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దారి మళ్లించిన కేసు విచారణ ఏమైంది? అని ప్రశ్నించారు.

కేసీఆర్ తొలిసారి సీఎం అయిన టర్ములో గ్యాంగ్ స్టర్ నయీమ్‌ ఎన్ కౌంటర్ తర్వాత ఆయన ఆస్తులు ఏమయ్యాయి? పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు పూర్తిగా బయటకు ఎందుకు వెల్లడించలేదు? ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు.

అదే విధంగా 2014లో కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు.. ఈరోజున ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? దీనిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఉందా? ఎందుకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, ప్రజల సొమ్ము దోపిడీకి గురైతే ఎందుకు విచారణ చేయడం లేదు? వాస్తవాలు ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదంటూ పలు డిమాండ్లు ఉన్నాయి. కాగా, ఇది ఎవరు విడుదల చేశారు? అనేది తెలియాల్సి ఉంది.

#janasena#pressnote#telangana#no name#signature#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి