సినిమా

Priyanka Mohan: రవితేజకి జంటగా బ్యూటీ ఫిక్స్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Priyanka Mohan: మాస్ మహారాజ్ రవితేజ త్వరలో కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. ఇటీవలే ఇరుముడి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన వెంటనే రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనుండగా, ఇంకోటి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పట్టాలెక్కబోతోంది. అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఫిక్సైనట్టుగా తెలుస్తోంది.

తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న ప్రియాంక:

ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత, శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయినా, కూడా నాని సరసన మరోసారి 'సరిపోదా శనివారం' సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా ప్రియాంకను తీవ్రంగా నిరాశపరిచింది.

ఫేడవుట్ అయిందనుకున్న సమయంలో ఓజీ ఛాన్స్:

ప్రియాంక కి తెలుగులో మూడు సినిమాలు చేస్తే, ఆ మూడు సినిమాలు పరాజయాన్ని మూటగట్టాయి. దీంతో, ఈ తమిళమ్మాయికి ఇక, తెలుగులో అవకాశాలిచ్చే వాళ్ళు లేరని..దాదాపుగా ఫేడవుట్ అయిందని మాట్లాడుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఓజీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. పాత్ర నిడివి తక్కువే అయినా బాగానే ఆకట్టుకుంది. అయినా, మళ్ళీ ఇప్పటి వరకూ తెలుగు సినిమాలో ఛాన్స్ దక్కలేదు.

ఇలాంటి, సమయంలో ప్రియాంక రవితేజ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుందనే తాజా వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ బ్యూటీ అటు యంగ్ హీరోలతో ఇటు సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఫిజిక్ ఉన్నది కావడం ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం, రవితేజ సినిమాకి టెక్నికల్ టీమ్ తో పాటు నటీనటులను ఎంపిక చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ విషయం వెల్లడి కానుందని తెలుస్తోంది. నిజంగా, ప్రియాంక మోహన్‌కి మాస్ మహారాజ్ సరసన ఛాన్స్ దక్కితే ఇక, టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నట్టే. చూడాలి, మరి ఏం జరుగుతుందో.

#Priyanka Mohan#Raviteja#Vivek Athreya#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి