క్రైమ్

Heart-wrenching: తల్లి మృతదేహం వద్ద చిన్నారి రోదన.. కన్నీళ్లు పెట్టించిన ఘటన!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తల్లి ప్రాణాలు తీసిన కిరాతకుల క్రూరత్వానికి ఓ పసిప్రాణం బలైంది. ఏ తప్పూ చేయని ఆ ఏడాదిన్నర పసిపాప.. ఉన్నట్టుండి కన్నతల్లి ప్రేమకు దూరమై అనాథగా మిగిలిపోయింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న తల్లి మృతదేహాన్ని పట్టుకుని, ఏమి జరిగిందో కూడా తెలియక ఆ చిన్నారి ఏడుస్తున్న దృశ్యం ప్రతీ ఒక్కరి గుండెలను పిండేసింది.

 తల్లి ప్రాణాలు తీసిన కిరాతకుల క్రూరత్వానికి ఓ పసిప్రాణం బలైంది. ఏ తప్పూ చేయని ఆ ఏడాదిన్నర పసిపాప.. ఉన్నట్టుండి కన్నతల్లి ప్రేమకు దూరమై అనాథగా మిగిలిపోయింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న తల్లి మృతదేహాన్ని పట్టుకుని, ఏమి జరిగిందో కూడా తెలియక ఆ చిన్నారి ఏడుస్తున్న దృశ్యం ప్రతీ ఒక్కరి గుండెలను పిండేసింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.

 ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సింధనూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆర్‌హెచ్ క్యాంప్ శివారులోని నిర్మానుష్యమైన పొలాల్లో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, స్థానికులకు అక్కడ కనిపించిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన తల్లికి ఏమి జరిగిందో తెలియక, ఆ చిన్నారి తల్లి మృతదేహాన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. ఈ కన్నీటి దృశ్యం చూసి అక్కడున్న వారందరూ  చలించిపోయారు.

 అనంతరం పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు ఆర్‌హెచ్ క్యాంప్ ప్రాంతానికి చెందిన 25ఏళ్ల స్నేహగా గుర్తించారు.ఆమెకు నాలుగేళ్ల క్రితం అమిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, గత నాలుగు నెలలుగా ఆమె శుభమ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా గుర్తించారు.

 కుటుంబ కలహాలు లేదా అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమై ఉంటుందా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన రాయచూరు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అనుమానితులుగా ఉన్న భర్త అమిత్‌తో పాటు ప్రియుడు శుభమ్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ హత్యలో వారి పాత్ర ఉందా? లేదా మరెవరైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసు అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

#KarnatakaCrime#RaichurNews#CrimeNews#HorrificMurder#KarnatakaPolice#CrimeUpdate#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి