తెలంగాణ

TG : సీఎం రేవంత్ సన్నిహితుడు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు : మహిళా వ్యాపారవేత్త!

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మహిళలకు వేధింపులు ఆగడం లేదు.రంగం ఏదైనా మహిళలు తమ అభ్యున్నతి కోసం చేసే పోరాటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలుస్తోంది.ఉద్యోగాలు చేసే దగ్గర మాత్రమే కాకుండా ఇంటా,బయట, ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో మహిళలకు వేధింపులు ఆగడం లేదు.రంగం ఏదైనా మహిళలు తమ అభ్యున్నతి కోసం చేసే పోరాటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలుస్తోంది.ఉద్యోగాలు చేసే దగ్గర మాత్రమే కాకుండా ఇంటా,బయట, ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకు కుటుంసభ్యులకు తెలిస్తే పరువు పోతుందని కొందరు బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయేవారు. ఆ బాధను సైలెంట్‌గా భరిస్తూ వచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో మహిళల వేధింపులకు సంబంధించి అవేర్‌నెస్ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. దీంతో కొందరు డేర్ చేసి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు వ్యక్త పరుస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియాను కొందరు వినియోగించుకుంటుంటే మరికొందరు నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారం. స్కూల్ పిల్లల నుంచి కాలేజీ వెళ్లే యువతులు, ఉద్యోగం చేసే మహిళలు, వ్యాపారంలో రాణించాలనుకునే ఎంటర్ ప్రెన్యూర్స్ సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

అమ్మాయిలు, మహిళలను ఆకతాయిల వేధింపుల నుంచి రక్షించేందుకు గత ప్రభుత్వం ‘షీ టీమ్స్‌’ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీరంతా రద్దీగా ఉండే బస్టాండ్స్, రైల్వే స్టేషన్ల వద్ద మఫ్టీలో ఉంటారు. మహిళలు,యువతలను వేధించేవారిని పట్టుకుని స్టేషన్ తరలిస్తుంటారు. అయితే, కొందరు బహిరంగంగా కాకుండా డిజిటల్ వేదికగా వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం. అసభ్యకరంగా మెసేజులు పెట్టడం, వాయిస్ రికార్డింగ్స్ పంపడం, తరచూ కాల్స్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు, కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ తన పోస్టులో పేర్కొంది. ఇది కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో సీఎంవో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

#Sexual harrasment#cm revanth reddy#close friend#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి