Tollywood: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించనుండగా, మోహన్ బాబు విలన్ పాత్రలో నటించాడు. నాని స్నేహితుడు బిర్యాని పాత్రలో సంపూర్ణేష్ కనిపించనున్నాడు. అయితే, ప్యారడైజ్ తర్వాత రిలాక్స్ అవుతాడనుకుంటే వరుసగా మూడు క్రేజీ చిత్రాలను లైన్‌లో పెట్టాడు నేచురల్ స్టార్.
‘ది ప్యారడైజ్’ తర్వాత సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’:
నాని సైన్ చేసిన ప్రాజెక్టుల్లో ముందుగా సెట్స్‌పైకి వచ్చే సినిమా ‘బ్లడీ రోమియో’. ‘సాహో’, ‘ఓజీ’ వంటి సినిమాలతో యాక్షన్ జానర్‌లో తనదైన శైలిని చూపించిన యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక, ఈ సినిమా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఆలస్యం కావడంతో ‘బ్లడీ రోమియో’ కూడా కొంత వెనక్కి వెళ్లింది. తాజా సమాచారం ప్రకారం నాని అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట. లండన్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. 2027 సమ్మర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
వెంకీ అట్లూరితో వెరైటీ సినిమా:
నాని కెరీర్‌లో మరో ఆసక్తికరమైన కలయికగా వెంకీ అట్లూరి దర్శకత్వంలోని సినిమా రాబోతోంది. ‘జెర్సీ’ తర్వాత నాని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరోసారి కలిసి సినిమా చేయనున్నారు. ఇక, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారట. అంతేకాదు, 2027లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
చర్చల్లో నాని- సిబి చక్రవర్తి సినిమా:
తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో కూడా నాని ఒక సినిమాను చేస్తాడని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకి మళ్ళీ, ఈ కాంబో సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్కేల్‌లోనే నాని- సిబి చక్రవర్తి సినిమా రూపొందనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, ది ప్యారడైజ్ తర్వాత కూడా నాని మూడు నుంచి నాలుగేళ్ళ వరకూ ఖాళీ లేడని అర్థమవుతోంది.











