తెలంగాణ

Nonveg : చికెన్ ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన ధరలు

రచన: Kumar4 నిమిషాల పఠనం

నాన్ వెజ్ ప్రియులకు మరో షాక్ తగిలింది.చికెన్ ధరలు కొండెక్కాయి. ఆదివారం కావడంతో ఈరోజు మాంసానికి భారీగా డిమాండ్ ఉంటుంది. మిగతా వారాల్లో కొందరు మాంసానికి దూరంగా ఉంటారు. సండే హాలిడే కావడం, కుటుంబసభ్యులు అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. ఎక్కువగా నాన్‌వెజ్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు.

నాన్ వెజ్ ప్రియులకు మరో షాక్ తగిలింది.చికెన్ ధరలు కొండెక్కాయి. ఆదివారం కావడంతో ఈరోజు మాంసానికి భారీగా డిమాండ్ ఉంటుంది. మిగతా వారాల్లో కొందరు మాంసానికి దూరంగా ఉంటారు. సండే హాలిడే కావడం, కుటుంబసభ్యులు అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి.. ఎక్కువగా నాన్‌వెజ్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. భారీ డిమాండ్ నేపథ్యంలోనే వ్యాపారులు సైతం క్యాష్ చేసుకునేందుకు ధరలు పెంచడానికి మొగ్గుచూపుతారు.ఈ క్రమంలోనే చికెన్ ధరలు మరోసారి పెరిగాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు పెరిగినట్టు సమాచారం.గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధర కిలోపై రూ.20 నుంచి రూ.30వరకు పెరిగినట్టు సమాచారం.పౌల్ట్రీ ఉత్పత్తి, డిమాండుకు సరిపడా సరఫరా వ్యత్యాసాల కారణంగా వ్యాపారులు ధరలను పెంచినట్లు తెలుస్తోంది. మటన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు చికెన్, చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఇవాళ చికెన్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడినట్టే అని ప్రచారం జరుగుతోంది.హైదరాబాద్ నగరంలో ఏరియాను బట్టి స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.250 నుంచి రూ.265 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కేజీ ధర రూ.230 నుండి రూ. 280 వరకు పలుకుతోంది.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర అత్యధికంగా రూ.270 పలుకుతోందని సమాచాం.

విశాఖపట్నంలో రూ. 250, అనకాపల్లిలో రూ. 260 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.దీనికి తోడు డీలర్ల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయని తెలుస్తోంది.ఓవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటం, వేతనాల పెరుగుదలలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు.నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

#Chiken#nonveg#price hike#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి