ఏపీ

AP : సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు ఆదేశం

రచన: Kumar••4 నిమిషాల పఠనం

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. అంతేకాకుండా, మృతుడు సాయికృష్ణ తల్లి గాదె విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని కోర్టు స్పష్టంచేసింది.

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. అంతేకాకుండా, మృతుడు సాయికృష్ణ తల్లి గాదె విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని కోర్టు స్పష్టంచేసింది. కాగా, 25 ఏళ్ల గాదె సాయికృష్ణను ఈ ఏడాది మే నెలలో గతంలో అతని ఉన్న రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లలో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత కృష్ణలంకకు తరలించగా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.దీంతో సాయికృష్ణ తల్లి పోలీసులను అశ్రయించింది. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో తన కుమారుడిని పోలీసులు లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ‘సిట్’ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా.. విచారణలో భాగంగా డిజిటల్ ఆధారాలను మాయం చేసినట్టు సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కగా..ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరచలేదని, ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల దర్యాప్తులో లోపాలు, సీనియర్‌ అధికారుల పాత్రపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. సంబంధిత హైకోర్టు విచారణలను నిలిపివేసి కేసును తానే పర్యవేక్షించాలని నిర్ణయించింది.

తగిన ఆధారాలు సమర్పించకపోతే తామే సీబీఐకి ఈ కేసు విచారణను అప్పగిస్తామని గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు స్వయంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఇదిలాఉండగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేసి అరెస్టు చేశారు.

#gadhe saikrishna#lockupdeath case#andrapradesh#CBI#Highcourt#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి