సినిమా

Raviteja-Thularabharam: అసలు జేడీ ఒప్పుకున్నాడా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Raviteja-Thularabharam: ఒక సినిమాకి ముందు సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి ప్రచారం జరుగుతుంటాయి. కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ప్రతీ గాసిప్ కూడా ఒక వైరల్ న్యూస్ అవుతుంది. అది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం. ఇక, ఇటీవల కాలంలో సరికొత్త స్ట్రాటజీను ఉపయోగిస్తున్నారు. ఓపెనింగ్ కి ముందే సినిమాలో ఈ సీనియర్ నటుడున్నాడు

Raviteja-Thularabharam: ఒక సినిమాకి ముందు సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి ప్రచారం జరుగుతుంటాయి. కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ప్రతీ గాసిప్ కూడా ఒక వైరల్ న్యూస్ అవుతుంది. అది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం. ఇక, ఇటీవల కాలంలో సరికొత్త స్ట్రాటజీను ఉపయోగిస్తున్నారు. ఓపెనింగ్ కి ముందే సినిమాలో ఈ సీనియర్ నటుడున్నాడు..ఆ బాలీవుడ్ స్టార్ ఉన్నాడు..ఈ ఐటం సాంగ్‌లో ఆ క్రేజీ బ్యూటీ ఉందని ప్రచారం జరుగుతోంది. అదే, సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది కూడా.

అలా, వస్తున్న వార్తల్లో 50 శాతం అవాస్తవాలే ఉంటాయి. కొన్ని మాత్రం కావాలనే లీకులిచ్చి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే..ఇటీవల 'ఇరుముడి' సినిమాతో సాలీడ్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నెక్స్ట్ సినిమాను, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో చేబోతున్నాడు. ఈ దసరా పండుగ సందర్భంగా ఘనంగా ప్రాజెక్ట్ లాంఛ్ చేయనున్నారు. ఇంతలోనే, రక రకాల వార్తలు వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రవితేజ (Ravi Teja) సినిమాతో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి (JD CHAKRAVARTHY) విలన్ పాత్రలో నటించబోతున్నాడని తాజాగా ఓ వార్త అంతటా వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత జేడీ..రవితేజ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి, ఇది రీ ఎంట్రీ కాదని చెప్పాలి. రవితేజతో కలిసి నటించి 19 ఏళ్ళవుతోంది. అంతే తప్ప..ఆయన తెలుగు సినిమాలో నటించి కాదు. వెబ్ సిరీస్ గానీ, సినిమాలలో గానీ నటిస్తూనే ఉన్నారు. ఇటీవలే గాయపడ్డ సింహం అనే సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు జేడీ. కాబట్టి, రీ ఇది ఎంట్రీ కాదు.

ఇక, వివేక్ ఆత్రేయ సినిమాలో నిజంగా జేడీ నటించేదే కన్‌ఫర్మ్ అయితే..ఖచ్చితంగా అది సాలీడ్ రోన్ అనుకోవచ్చు. అయితే, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, అందులో తన పాత్ర నచ్చకపోతే జేడీ ఒప్పుకోడు..ఇది కన్‌ఫర్మ్. హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్, కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే..ఈ ప్రాజెక్ట్‌లో జేడీ చక్రవర్తి గానీ, ప్రియాంక గానీ, అనస్వర గానీ నటిస్తున్నట్టుగా ఇప్పటి వరకూ మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ లేదు. కేవలం, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్ప. ఇక, ఈ సినిమాకి 'తులాభారం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలో, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించి అసలైన వాస్తవాలు వెలువడనున్నాయి.

#Ravi Teja#JD Chakravarthy#Vivek Athreya#Priyanka Arul Mohan#Anaswara Rajan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి