సినిమా

Mokshagna: ఆరోజెప్పుడు అంటున్న నందమూరి ఫ్యాన్స్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mokshagna: నందమూరి అభిమానులు దాదాపు 4 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు దగ్గరపడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొడుడు మోక్షజ్ఞ తేజ హీరోగా తెలుగుతెరకు పరిచయం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవలే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

మోక్షజ్ఞ–వశిష్ఠ కలయికలో రూపొందనున్న మూవీపై అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం వశిష్ఠ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే ఒక ఐడియా ఉండగా, తన రైటర్స్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెరపథ్యంలోనే టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో సినిమా ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు, రెగ్యులర్ షూటింగ్ కూడా డిసెంబర్ నుంచి ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మైథలాజికల్ సబ్జెక్ట్‌లోనే మాస్ అండ్ కమర్షియల్ అంశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సినిమాలా మోక్షజ్ఞ సినిమాను ఆలస్యం చేయకుండా నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్‌తో పూర్తి చేయాలని భావిస్తున్నాడట. 2027 లో ఎట్టి పరిథితుల్లోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కా ప్లానింగ్‌తో సెట్స్‌పైకి రాబోతున్నాడట.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో ఇంతకముందు కూడా పలు రకాల వార్తలు, ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ..ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఇప్పుడు వశిష్ఠ సినిమాపైనే అభిమానుల ఆశలు పెట్టుకున్నారు. మరి, ఈ సినిమా అనుకున్నట్టుగా పూర్తై ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

#mokshagna nandamuri#mokshagna debue movie#balakrishna#tollywood#Mallidi Vassishta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి