తెలంగాణ

Breaking : అవినీతి జలగలు.. ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అవినీతి అక్రమార్కులు పట్టుబడుతున్నా కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూనే అక్రమార్జనకు ఎగబడుతున్నారు.ప్రతిరోజూ ఏదో మూల ఏసీబీకి అధికారులు చిక్కుతున్నారు. ఈ విషయం తెలిసినా లంచం తీసుకుంటే పట్టుబడతామేమో అన్న భయం వారిలో కనిపించడం లేదు.

రాష్ట్రంలో అవినీతి అక్రమార్కులు పట్టుబడుతున్నా కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూనే అక్రమార్జనకు ఎగబడుతున్నారు.ప్రతిరోజూ ఏదో మూల ఏసీబీకి అధికారులు చిక్కుతున్నారు. ఈ విషయం తెలిసినా లంచం తీసుకుంటే పట్టుబడతామేమో అన్న భయం వారిలో కనిపించడం లేదు. మరికొందరైతే పట్టుబడితే దొంగ? లేదంటే దొర అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

అవినీతి కేసులో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు విధించకపోవడం వల్లే ఎదుటివారిలో భయం కనిపించడం లేదని కొందరు అంటున్నారు. శిక్షలు కఠినంగా ఉండి అక్రమంగా సంపాదించిన ఆస్తులు రికవరీ చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించినప్పుడే లంచం తీసుకోవాలనే వారిలో భయం ఉంటుందని భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ ట్రెజరీ ఆఫీస్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెడికల్ బిల్లులు క్లియర్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారిని పట్టుకున్నారు.

ముందుగా రూ.3 వేలు నగదు స్వీకరించిన జూనియర్ అసిస్టెంట్.. రూ.22 వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరించినట్టు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారించగా నిజం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకున్నట్టు నిర్దారణ జరిగింది.దీంతో జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం చర్యలు ఉంటాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

#Curruption#ACB#junior assistant#Caught#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి