Directors: ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్ దర్శకుడినైనా, హీరోనైనా అడ్రస్ లేకుండా చేస్తుంది. వీరికి, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే మళ్ళీ సినిమా ఛాన్స్ రావచ్చేమో గానీ, నిర్మాత మాత్రం మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం. ఇలా, ఒక్క భారీ డిజాస్టర్ రాగానే ఇండస్ట్రీలో కనపడకుండాపోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ సక్సెస్ మాత్రమే కొలమానం. నాలుగు భారీ హిట్స్ అందుకున్న వాళ్ళు కూడా ఓ డిజాస్టర్ మూలంగా గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పడం లేదు.
దసరా సినిమాతో దర్శకుడిగా మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా తర్వాత నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ మధ్యలో నానితోనే మళ్ళీ ది ప్యారడైజ్ సినిమాను తీశాడు. ఇక్కడే, శ్రీకాంత్ ఓదెల ఓ రాంగ్ స్టెప్ వేశాడనుకోవచ్చు. నానితో రెండవ సినిమా కూడా చేశాక, చిరు సినిమాను ప్రకటించాల్సింది.
ముందుగానే, మెగాస్టార్ సినిమాను ప్రకటించడంతో అంచనాలు పెరిగిపోయాయి. ది ప్యారడైజ్ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. దాంతో, ఇప్పుడు చిరంజీవితో అనుకున్న ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. స్వయంగా, నానీ ఈ విషయాన్ని చెప్పీ చెప్పనట్టుగా చెప్పి ఆల్మోస్ట్ చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీ లేనట్టే అని చెప్పాడు. ఇప్పుడు, శ్రీకాంత్ పరిస్థితి ఏంటంటే, ఓ చిన్న సినిమాను చేసి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలి. దీనికి, నాని తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
అంటే, హీరోగా నాని చేస్తాడని కాదు..నాని నిర్మాణంలో ఓ చిన్న బడ్జెట్ సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడని. శ్రీకాంత్ కూడా ఈ మధ్య అదే చెప్పాడు. నాని అన్న నన్ను భరించాల్సిందే..ఆయనకి వేరే ఆప్షన్ లేదు అని. అయితే, ఒక్క సినిమా ఫ్లాపైతే, దర్శకుడికి సత్తా లేదని ఎలా జడ్జ్ చేస్తారు అన్నది ప్రశ్న. ఇదే, దర్శకుడు దసరా తీసి హిట్ కొట్టాడు. ఆ దర్శకుడికే రెండవ సినిమాతో ఫ్లాప్ పడింది. మరి, అనుకున్న సినిమా క్యానిల్ చేయడం ఎందుకు.? ఇది ఒక్క శ్రీకాంత్ ఓదెల గురించే కాదు..ఫ్లాప్ వల్ల ఛాన్సులు రాని మిగతా దర్శకుల గురించి కూడా. ఇక్కడ, సక్సెస్ తో పాటు టాలెంట్ కూడా కొలమనంగా చూడాలి. అప్పుడే, ఇండస్ట్రీలో మంచి దర్శకులు నిలబడగలుగుతారు. ఇది, ఆలోచించాల్సింది కూడా హీరోలే.


