సినిమా

Anil Ravipudi: అందరికీ నీ అంత టాలెంట్ ఉంటే బావుండు అనీలూ!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Anil Ravipudi: టాలీవుడ్ లో వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చారంటే ఆ తర్వాత ఫ్లాప్ పడి..కెరీర్ డైలమాలో పడుతున్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఒక్కొక్క దర్శకుడు సినిమా సినిమాకి కనీసం మూడేళ్ళైనా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఒక సినిమా హిట్ అయితే, ఆ తర్వాత సినిమా కూడా హిట్ అవ్వాలనే ఒత్తిడి..మొదటి సినిమా కంటే రెండవ సినిమా హీరో బిగ్ స్టార్ అయితే బావుండు అనుకోవడం ఒకటి.

ఇలా, నేటి తరం దర్శకుల్లో చాలామంది ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఒక సినిమా చిన్న సినిమా తీస్తే, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా అని చేతులు కాల్చుకుంటున్నారు. అంతే, కెరీర్ ఖతం. కానీ, అందరికంటే ఎక్కువ సేఫ్ గేమ్ అడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి గత చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు వరకూ 9 సినిమాలు తీశాడు.

ఈ 9 సినిమాలు బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు, వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ తీస్తున్నాడు. ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం అనిల్ కంటే మిగతావాళ్ళలో బలంగా ఉంది. అంతగా ఈ హిట్ మెషిన్ అందరి నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు. అయితే, ఏడాదికొక సినిమా తీస్తూ రేసులో ముందున్న అనిల్ రావిపూడి..స్మాల్ స్క్రీన్ మీద కూడా చాలా బిజీగా ఉంటున్నాడు. తనలో ఉన్న అడిషనల్ టాలెంట్‌ను కూడా ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

మన స్టార్ డైరెక్టర్స్‌లో చాలామంది బ్లాక్ బస్టర్స్ తీస్తారు గానీ, ఈవెంట్స్‌లో గొప్పగా స్పీచ్ కూడా ఇవ్వలేరు. కానీ, అనిల్ ఈ విషయంలో కింగ్ అని చెప్పాలి. బిల్లి తెరమీద జడ్జ్‌గా వ్యవహరిస్తూ చిన్న చిన్న డాన్స్ మూవ్‌మెంట్, సింగింగ్, కామెడీ..ఇలా చాలా పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పుడున్న ఏ అగ్ర దర్శకుడిలోనూ అనిల్ రావిపూడికి ఉన్నంత టాలెంట్ లేదని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అవి సరదా కామెంట్స్ అయినా..అనిల్ రావిపూడిలో నిజంగా చాలా టాలెంట్స్ ఉన్నాయి.

#Anil Ravipudi#Tv Shows#Venkatesh#Kalyan Ram#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి