టాప్ న్యూస్

Sensational : రాజకీయాల్లోకి హీరో ధనుష్.. త్వరలో కొత్త పార్టీ ప్రకటన!

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను సినీరంగం నుంచి వచ్చిన వారే చక్రం తిప్పుతున్నారు. తమిళ ప్రజలు సైతం తమ అభిమాన నటీనటులకే అగ్రతాంబూలం ఇచ్చారు.

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను సినీరంగం నుంచి వచ్చిన వారే చక్రం తిప్పుతున్నారు. తమిళ ప్రజలు సైతం తమ అభిమాన నటీనటులకే అగ్రతాంబూలం ఇచ్చారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, మొన్న వచ్చిన జోసెఫ్ విజయ్ వరకు వీరంతా సినిమాల్లో ఓ వెలుగువెలికి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.

దివంగత మాజీ సీఎం కరుణానిధి ‘డీఎంకే’ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించగా.. మరో దివంగత మాజీ సీఎం ఎంజీఆర్ ‘అన్నాడీఎంకే’ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. కరుణానిధి మరణాంతరం మాజీ సీఎం స్టాలిన్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయన కూడా నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈయన కూడా నటుడే.. ఇక ఎంజీఆర్ మరణాంతరం అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత.. రెండు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆమె మరణాంతరం చోటుచేసుకున్న పరిణామాల క్రమంగా అన్నాడీఎంకే పార్టీలో వర్గపోరు ఎక్కువ అయ్యింది. ఫలితంగా ఆ పార్టీకి ప్రజాదరణ తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారంలోకి రాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పార్టీ స్థాపించిన అతితక్కువ కాలంలోనే విజయ్‌కు ప్రజలు అండగా నిలబడటం, ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే, డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో విసిగిపోయిన తమిళ ప్రజలు విజయ్‌కు పట్టం కట్టినట్టు తెలిసింది.

అయితే, తాజాగా రాజకీయ రంగప్రవేశానికి నటుడు ధనుష్ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ధనుష్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.

కొంతకాలం క్రితమే తన ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేక జెండాను ధనుష్ ఆవిష్కరించారు.అదే జరిగితే విజయ్ లాగా.. ధనుష్ ఒంటరిగా బరిలోకి దిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.కాగా, గతంలో ధనుష్ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా అనారోగ్య కారణాలతో ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు.ఒకవేళ ధనుష్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే రజినీకాంత్ మద్దతుతో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.

#hero dhanush#tamilanadu#political entry#cinema#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి