ఏపీ

AP: సంచలనం.. రాప్తాడు నిందితుడిపై కాల్పులు.. పరిస్థితి విషమం..

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

AP: అనంతపురం జిల్లా రాప్తాడు స్కూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై ఎలక్ట్రిక్ రంపంతో ఎటాక్ చేసి పారిపోయిన ఉన్మాది హేమంత్ సీన్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. క్రైమ్ చేసిన వెంటనే ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలోకి ఎస్కేప్ అయిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.

AP: అనంతపురం జిల్లా రాప్తాడు స్కూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై ఎలక్ట్రిక్ రంపంతో ఎటాక్ చేసి పారిపోయిన ఉన్మాది హేమంత్ సీన్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. క్రైమ్ చేసిన వెంటనే ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలోకి ఎస్కేప్ అయిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.

ఫారెస్ట్‌లో ఫైరింగ్

నిందితుడు ఆత్మకూరు అడవుల్లో దాక్కున్నట్లు లోకల్ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ టీమ్స్ వెంటనే ఆ ఏరియాను కార్డన్ ఆఫ్ చేశాయి. సరెండర్ అవ్వాలని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా, వినకుండా తప్పించుకుని పారిపోయేందుకు నిందితుడు ట్రై చేశాడు. దీంతో పోలీసులు ఏమాత్రం లేట్ చేయకుండా నిందితుడిపై వరుసగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అదుపులోకి తీసుకుని, వెంటనే అనంతపురం హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

స్కూల్ రూమ్‌లోకి చొరబడి దారుణం

రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో క్లాస్‌రూమ్‌లోకి చొరబడిన హేమంత్.. గోపిక అనే విద్యార్థిపై ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ముఖం, తలపై లోతైన గాయాలు కావడంతో ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. అడ్డుకోబోయిన విద్యార్థి ఫ్రెండ్ లక్ష్మికి కూడా సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి. క్రైమ్ చేసి అడవుల్లో దాక్కుంటే తప్పించుకోవచ్చనుకున్న నిందితుడిని పోలీసులు పక్కా ప్లాన్‌తో ఛేజ్ చేసి కాల్పులు జరపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

#Andhra Pradesh#Raptadu#Anantapur#Hemanth#Raptadu School Attack#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి