Ramayana: ఇప్పటి వరకూ ఫక్తు కమర్షియల్ సినిమాలలో నటించిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఇతిహాసం ఆధారంగా రూపొందిన రామాయణలో నటించే అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయం. అయితే, ఇలాంటి సినిమాలలో పాత్రలను పోషించేటప్పుడు ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని దాటుకొని సీతగా సాయి పల్లవి, శూర్పణఖ పాత్రలో రకుల్ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మినంచిన భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే, ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇద్దరు కథానాయికలు సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్.
భానూ నుంచి సీతగా సాయి పల్లవి..
ఏఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో తన సహజమైన నటనతో నేచురల్ పర్ఫార్మెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సాయి పల్లవికి రామాయణ సినిమాలో సీత పాత్ర దక్కడం అదృష్టం. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పటి నుంచే అందరిలో ఆసక్తి మొదలైంది. సీత పాత్రలో ఆమె కనిపించిన తీరు, ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించాయి. గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా పాత్రకు అవసరమైన హుందాతనం, ప్రశాంతతను తన నటనలో చూపించడం సాయి పల్లవి ప్రత్యేకతగా అభిమనౌలు చెప్పుకుంటున్నారు. సినిమా విడుదలకి ముందు గెటప్, కాస్ట్యూంస్ విషయంలో సాయి పల్లవికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ముందుకు వచ్చాక మాత్రం ఈ పాత్రలో సాయి పల్లవిని చూడటం అభిమానులకు మరో కొత్త అనుభూతిగా అనిపిస్తోంది.
శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్..
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే శూర్పణఖ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన పాత్రగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకు గ్లామర్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రకుల్.. ఈసారి రామాయణంలోని కీలకమైన పాత్రను ఎంచుకున్నారు. రావణుడి సోదరిగా, జనస్థాన రాజకుమారిగా ఆమె కనిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా శూర్పణఖ పాత్రలోని విభిన్న భావోద్వేగాలను తెరపై చూపించే అవకాశం రకుల్‌కు దక్కింది. ఈ పాత్రను సిల్వర్ స్క్రీన్ మీద చూసిన అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మొత్తానికి, సీతగా సాయి పల్లవి శూర్పణఖ పాత్రలో రకుల్ అటు బాలీవుడ్ ఇటు సౌత్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు.


