సినిమా

Keerthy Suresh: తల్లిపై కీర్తి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు..

4 నిమిషాల పఠనం

Keerthy Suresh: తల్లిపై స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తన తల్లి, సీనియర్ నటి మేనక గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన కీర్తి.. తన తల్లి తన డైరీని చదవడమే కాకుండా, దానిని కాల్చేసి ఉంటుందని కూడా అనుమానాలను వ్యక్తం చేశారు.

కీర్తి ప్రేమ విషయం డైరీ ద్వారా తెలిసిపోయింది!

కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024 డిసెంబర్ 12న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి ప్రేమ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయని కీర్తి తాజాగా వెల్లడించారు.

కీర్తి ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఆంటోనీతో ప్రేమలో పడ్డానని తెలిపారు. కాలేజీ రోజుల్లో తన తల్లి మేనకకు ఈ విషయం తెలిసిపోయిందట. అందుకు కారణం తన వ్యక్తిగత డైరీ అని చెప్పారు. తన ప్రేమకు సంబంధించిన ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునేదానినని, ఒకరోజు తన తల్లి ఆ డైరీని చదివారని వెల్లడించారు. అయితే, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ నా డైరీ కనిపించలేదని..అమ్మకి తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ రాయాలన్న ఆసక్తి కలగలేదని చెప్పుకొచ్చింది.

మా ఇద్దరి మతాలు వేరు. ఆంటోనీ తట్టిల్ క్రిస్టియన్ కావడంతో మా అమ్మానాన్నల నుంచి మొదట్లో కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయని కీర్తి వెల్లడించారు. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు. 2009 డిసెంబర్‌లో తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ 2010 జనవరిలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత, చాలాకాలం తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2024లో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గోవాలో వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. కానీ, ఇప్పటికీ నా డైరీని అమ్మ కాల్చేసి ఉంటుందని అనుమానం అన్న విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ..కొందరు మాత్రం ఇవి, సరదాగా చేసినవే అంటున్నారు.

#Keerthy Suresh#Menaka#Antony#Kollywood#Actress Keerthy Suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి