సినిమా

Prabhas: RFCలో జాయిన్ అయిన ప్రభాస్.. మళ్లీ స్పిరిట్‌కు బ్రేకేనా?

5 నిమిషాల పఠనం

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్, విడుదల తేదీల విషయంలో మార్పులు చోటు చేసుకుంటుండటంతో అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. తాజాగా, ప్రభాస్ మళ్లీ ఫౌజీ షూటింగ్‌లో జాయిన్ కావడంతో స్పిరిట్ పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలైయ్యాయి.

మళ్ళీ ఫౌజీ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా డేట్స్!

ఇటలీ వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు ప్రభాస్. ఈ నవంబర్ 9 నుంచి ఫౌజీ కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వివాహ వేడుక సెట్ నిర్మించి ప్రభాస్, హీరోయిన్ ఇమాన్విపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు.

వాస్తవానికి ఫౌజీ సినిమా డిసెంబర్ 3, 2026లో విడుదల కావాల్సి ఉంది. కానీ.. షూటింగ్, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో విడుదలను 2027 మార్చి 19కి మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో, ప్రభాస్ కూడా ఫౌజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది.

స్పిరిట్‌కు మళ్లీ బ్రేక్ పడినట్టేనా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా స్పిరిట్‌పై కూడా ఇటు డార్లింగ్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే, ఫౌజీ షూటింగ్‌కు ప్రభాస్ ప్రాధాన్యత ఇవ్వడంతో స్పిరిట్ షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్పిరిట్ కోసం చిత్రబృందం ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ ఎప్పుడు తిరిగి స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఒక్కో సినిమాకి ఎందుకింత సమయం పడుతుందో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

#Prabhas#Fauzi#Hanu Raghavapudi#Imanvi#Tollywood#Spirit
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి