జాతీయం

NRI : అమెరికా పోలీసులపై టపాసులతో దాడి.. దేశం పరువు తీస్తున్నారంటూ?

5 నిమిషాల పఠనం

ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయుల ఆగడాలు శృతి మించుతున్నాయా? అందుకే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను టార్గెట్ చేశాడా? చదువు, ఉద్యోగం కోసం వచ్చి అక్కడే సెటిల్ అయ్యి అమెరికన్స్‌ను డామినేట్ చేస్తున్నారనే భారతీయుల మీద ద్వేషం పెరిగి లోకల్స్ దాడులకు తెగబడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయుల ఆగడాలు శృతి మించుతున్నాయా? అందుకే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను టార్గెట్ చేశాడా? చదువు, ఉద్యోగం కోసం వచ్చి అక్కడే సెటిల్ అయ్యి అమెరికన్స్‌ను డామినేట్ చేస్తున్నారనే భారతీయుల మీద ద్వేషం పెరిగి లోకల్స్ దాడులకు తెగబడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరి స్వదేశానికి డిపోర్టు చేసిన విషయం తెలిసిందే.

అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారతీయులకు వివేశ ఆదరణ లభించింది. ఇండియన్స్ ప్రతిభనుఆయన చాలా సార్లు మెచ్చుకున్నారు.తెలివి గల, ప్రతిభావంతులైన భారతీయులకు అమెరికా గేట్లు తెరిచి మరి వెల్ కమ్ చెప్పారు. వీసాల జారీ సంఖ్యను పెంచారు.ఉద్యోగా అవకాశాలు కల్పించారు. రాజకీయాల్లో సైతం ఎంకరేజ్ చేశారు. కానీ, ఇటీవలి కాలంలో భారతీయుల మీద శ్వేతజాతీయులు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారు. ఎందుకు ఇండియన్ స్టూడెంట్స్, ఉద్యోగులు టార్గెట్ అవుతున్నారు. ఎందుకు వారి మీద దాడులు, హత్యాప్రయత్నాలు పెరుగుతున్నాయి.

దీనంతటికి భారతీయుల డామినేషన్, జనాభా పెరగడం ఒక కారణమైతే..తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని లోకల్స్‌కు అధికార రిపబ్లికన్ పార్టీ నూరిపోయడం మరో కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఖలిస్థాన్ తీవ్రవాద భావజాలం కలిగిన వారు సైతం ఇండియన్స్ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. అదేవిధంగా అమెరికాకు బతుకుదెరువు కోసం వెళ్లిన ఇండియన్స్ అక్కడ హిందూ పండుగలను ఘనంగా సెలబ్రేట్ చేయడం,ట్రాఫిక్ అంతరాయాలు కల్గించడం, డప్పుసప్పుళ్లతో యూఎస్ వీధుల్లో సందడి చేయడం సైతం వారిని ఇరిటేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో దీపావళి పండుగ సందర్భంగా పోలీసులపై కొందరు భారతీయ విద్యార్థులు టపాసులతో దాడి చేసినట్టు తెలిసింది. దీంతో భారతీయుల ప్రవర్తన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో దేశం పరువుతీయొద్దంటూ కొందరు సూచిస్తున్నారు. దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడం కలకలం రేపింది.దీంతో వాహన దారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపైనే టపాసులు విసిరి హ్యాపీ దీపావళి అంటూ సందడి చేశారు. అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయారు.దీంతో ఇండియన్స్ బిహేవియర్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు అక్కడి చట్టాలకు లోబడి నడుచుకోవాలని, దేశం పరువు తీయొద్దని కొందరు సూచిస్తున్నారు.

#indians#america#streets#crackers blast#newyork police#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి