తెలంగాణ

TG : బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!

5 నిమిషాల పఠనం

తెలంగాణలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ(basara IIIT) సమస్యలకు నెలవుగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ట్రిపుల్ ఐటీని వేధిస్తున్నది.మొన్నటివరకు నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కలుషిత నీటి కారణంగా అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ(basara IIIT) సమస్యలకు నెలవుగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ట్రిపుల్ ఐటీని వేధిస్తున్నది.మొన్నటివరకు నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కలుషిత నీటి కారణంగా అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతపెద్ద విద్యాలయంలో మెయింటెన్స్ సరిగా లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, నిధుల సమస్య కూడా వెంటాడుతోందని సమాచారం.

మౌలిక వసతుల లేమితో విద్యార్థులు చదువు మీద దృష్టి సారించలేకపోతున్నట్టు సమాచారం. నిత్యం అనారోగ్య సమస్యలు, నీటి సమస్యలు వేధిస్తుంటే ఇక వారు చదువు మీద ఎలా దృష్టిసారిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TG :  బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!

కాలేజీలో మురుగు నీటి సరఫరా ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వసతి గృహాల కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా అవుతోందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఆ నీటి వాడటంతో చర్మవ్యాధులు, అలర్జీలు వస్తున్నాయని విద్యార్థినుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నీరు సైతం డ్రైనేజీ వాటర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది.

అంతేకాకుండా, భోజన శాలలో ఆహార నాణ్యతపైనా విద్యార్థులు ఆందోళన తెలుపుతున్నారు. భోజనం తయారీకి కూడా అదే నీటిని ఉపయోగిస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, నీటి కొరత కారణంగా సెలవులు పొడిగించారని, ఆన్‌లైన్ తరగతుల నిర్వహించనున్నట్టు కాలేజీ మేనెజ్మెంట్ ప్రకటించిందని, మళ్లీ భౌతిక తరగతులకు పిలిచారని పేర్కొన్నారు.

TG :  బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!

అయితే, కలెక్టర్ చొరవతో గోదావరి నీటి తరలింపునకు మోటార్ల కోసం రూ.8 లక్షలు మంజూరు చేయగా.. నీటి నమూనాలు సేకరించి అధికారులు ల్యాబ్‌కు పంపారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.డైలీ యూసెజ్, తాగే నీరు కలుషితం ఎలా అయ్యిందని అందుకు గల కారకులు ఎవరో కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భోజనం నాణ్యతపైనా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

#basara IIIT#poluted water#smelled#drinage water#skin disease#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి