రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వారిమీద కన్నేస్తున్నారు. టీచర్లు, వార్డెన్ల ముసుగులో ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కథనాలు వస్తూనే ఉన్నాయి.అధికారులు చర్యలు తీసుకుంటున్నా కొందరు మృగల్లా ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి రాష్ట్రంలో వెలుగుచూసింది.
నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికలతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు బాలికలు ఆరోపించారు. తమను అసభ్యకరంగా తాకుతున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని సమాచారం. ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడని భయంతో చిన్నారులు వెల్లడించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుకోసం అని గురుకులాలకు పంపిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బాలికల పేరెంట్స్ సైతం వాపోతున్నారు. గురుకుల ప్రిన్సిపాల్‌కు విషయాన్ని తెలియజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని వెల్లడించారు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన కార్మికుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు.


