సినిమా

pawankalyan : పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు.. వేణుస్వామి జోస్యం నిజం కానుందా?

6 నిమిషాల పఠనం

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన మూడో భార్య అన్నా లెజినోవాతో 13 సంవత్సరాల వివాహా బంధానికి పరస్పర అంగీకారంతో ఎండ్ కార్డ్ వేశారు.ఇకమీదట ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని, బాధ్యతాయుతంగా పిల్లల బాగోగులు చూసుకుంటామని చెప్పారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన మూడో భార్య అన్నా లెజినోవాతో 13 సంవత్సరాల వివాహా బంధానికి పరస్పర అంగీకారంతో ఎండ్ కార్డ్ వేశారు.ఇకమీదట ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని, బాధ్యతాయుతంగా పిల్లల బాగోగులు చూసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయం అటు జనసైనికులను,పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధించే అభిమానులకు తేరుకోకుండా చేసింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, మొన్నటివరకు తన మూడో భార్యతో సంతోషంగానే గడిపిన పవన్.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అంతా షాక్‌లో ఉన్నారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద యుద్ధమే నడిచి ఉంటుందని, అంత ఈజీగా ఎవరూ విడాకులు తీసుకోరు కదా? అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

pawankalyan :  పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు.. వేణుస్వామి జోస్యం నిజం కానుందా?

అయితే, గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద అప్పటి అధికార వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన తన మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వడంతో మరో సారి పెళ్లి చేసుకుంటారా? అని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి పవన్ పెళ్లిళ్ల మీద మరోసారి వైసీపీ నేతలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు. అయితే, పవన్ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కూటమి నేతలు సూచిస్తున్నారు.

వేణుస్వామి చెప్పిందే నిజమైందా?

ఇదిలాఉండగా, సినిమా తారల వివాహ బంధాలు ఎంతకాలం నిలుస్తాయని జోస్యం చెప్పే వేణుస్వామి మరోసారి తెరపైకి వచ్చారు. గతంలో పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం మీద ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పవన్ జాతకంలో గురువు నీచ స్థితిలో ఉన్నారని.. దాని ప్రకారం ఆయన జీవితంలో మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. నిన్న రాత్రి పవన్ తన మూడో భార్యకు విడాకులు ప్రకటించడంతో వేణుస్వామి చెప్పిందే నిజం అయ్యిందని, పాత వీడియోలను కొందరు ట్రోల్ చేస్తున్నారు.కాగా, వేణుస్వామి చెప్పినట్టు పవన్ మరో పెళ్లి చేసుకుంటాడా? లేదా మూడో పెళ్లితోనే ఆపేస్తారా? అన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పవన్ వైవాహిక జీవితం మొదలైంది ఇలా..

పవన్ కళ్యాణ్ తన జీవితంలో మొదట నందిని అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే, 1997 నుంచి ఆమెకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2008లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆ తర్వాత బద్రి సినిమా షూటింగ్ సమయంలో యాక్టర్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. అనంతరం 2009లో ఆమెతో రెండో వివాహం జరిగింది. ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య ఉన్నారు.

ఇక మూడో వివాహం రష్యా జాతీయురాలైన అన్నా లెజ్‌నెవాతో జరిగింది. 'తీన్ మార్' (2011) సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2013లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.13 ఏళ్ల బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పవన్ కళ్యాణ్, అన్నాలెజినోవా ప్రకటించారు. వీరిద్దరికి కూతురు పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు.

#pawankalyan#venuswami#marriagelife#prediction#cinema#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి