తెలంగాణ

TG : తెలంగాణలో చల్లగాలులు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్

3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.దీంతో చలి తీవ్రత పెరిగింది.ఉదయం లేవాలంటేనే ప్రజలు జంకుతున్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న 3 రోజుల పాటు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాష్ట్రంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.దీంతో చలి తీవ్రత పెరిగింది.ఉదయం లేవాలంటేనే ప్రజలు జంకుతున్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న 3 రోజుల పాటు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

12 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, జనగామ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. ఏజెన్సీ, ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలైన సంగారెడ్డి, మెదక్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరగనుంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 12 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

వాహనదారులు బీ అలర్ట్..

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉండటంతో వాహనదారులు, ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించేవారు వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచించారు. చలిగాలుల తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వచ్చేటప్పుడు వింటర్ దుస్తులు ధరించాలని సూచించారు. రాత్రి, వేకువజామున అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

#Cold waves#telangana#Agency areas#cities#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి