సినిమా

Janhvi Kapoor: ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాతే అమ్మ సినిమాలకి ఒప్పుకుంది..

4 నిమిషాల పఠనం

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెలలో ఒకరైన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధడక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా, తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి దేవర, రామ్ చరణ్‌తో చేసిన పెద్ది సినిమాలలో నటించిన తర్వాత ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, మొదట్లో మాత్రం ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తల్లి శ్రీదేవి ఒప్పుకోలేదని సీక్రెట్ రివీల్ చేసింది.

ఈ నేపథ్యంలోనే, తాజాగా జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా, తన ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాతే తనలో హీరోయిన్ అయ్యే లక్షణాలు కనిపించాయని తల్లి భావించినట్లు ఆమె సరదాగా చెప్పడం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.

హీరోయిన్ అవుతానంటే శ్రీదేవి ఒప్పుకోలేదా?

జాన్వీ కపూర్ హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు తల్లి శ్రీదేవి వెంటనే అంగీకరించలేదట. సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంటే అంత సులభమైన విషయం కాదంటూ గట్టిగా వాదించదట. నటిగా కొనసాగాలంటే జీవితాన్ని పూర్తిగా సినిమాలకే అంకితం చేయాలని..అలా శ్రమించడం ఎంతో కష్టమని చెప్పారట. ఇదే, విషయాన్ని ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేటివ్, నటి మహేశ్వరితో కలిసి పాల్గొన్న సందర్భంగా జాన్వీ గుర్తుచేసుకుంది.

సినిమాల్లోకి రావాలనే తన నిర్ణయం గురించి తల్లికి చెప్పినప్పుడు, ఆమె కొంత ఆశ్చర్యపోయారని జాన్వీ వెల్లడించింది. అయితే, చివరకు తనకు ఒక విషయం స్పష్టంగా చెప్పారని, ఈ రంగంలోకి వస్తే పూర్తిస్థాయిలో కష్టపడాల్సి ఉంటుందంటూ హెచ్చరించారని తెలిపింది జాన్వీ కపూర్. అలా, కెరీర్ ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా శ్రీదేవి తనయ ఇంతకాలానికి బయటపెట్టడం కొందరికి షాకింగ్‌గా అనిపిస్తోంది. కాగా, తెలుగులో ఆమె నటించిన దేవర..పెద్ది చిత్రాలలో ఆశించిన క్రేజ్ రాలేదనే చెప్పాలి. మరి, టాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలను అందుకుంటుందో లేదో చూడాలి.

#Janhvi Kapoor#Sridevi#Devara#NTR#Peddi#Ram Charan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి