క్రైమ్

Crime : లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

4 నిమిషాల పఠనం

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. రాష్ట్రంలో లోన్‌యాప్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ని డిమాండ్లు వినిపిస్తున్నా చర్యలు మాత్రం ఆశించిన మేర ఉండటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులు, టెకీలు, మహిళలు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు ఇలా అనేక మంది లోన్‌యాప్ వేధింపులకు బలయ్యారు.

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. రాష్ట్రంలో లోన్‌యాప్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ని డిమాండ్లు వినిపిస్తున్నా చర్యలు మాత్రం ఆశించిన మేర ఉండటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులు, టెకీలు, మహిళలు, ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులు ఇలా అనేక మంది లోన్‌యాప్ వేధింపులకు బలయ్యారు. ప్రాణాలు పోతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. గతంలో ఇలాంటి లోన్‌యాప్‌లను కేంద్రం నిషేధించింది. అయినా కొత్తగా పుట్టుకొస్తున్నాయి.

తాజాగా ఆన్లైన్ లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ కానిస్టేబుల్‌ బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌‌‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నాలుగు నెలల కిందట ఓ లోన్ యాప్‌ ద్వారా శ్రీను అనే కానిస్టేబుల్ రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో అతనికి వేధింపులు మొదలయ్యాయి.

గంటకోసారి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయసాగారు. డబ్బులు చెల్లిస్తానని, కొంత గడువు ఇవ్వాలని చెబుతున్నా వినకుండా నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ బెదిరింపులకు గురిచేసినట్టు తెలిసింది.అంతటితో ఆగకుండా అతని భార్యకు సంబంధించిన నగ్న చిత్రాలు పంపిస్తామంటూ హెచ్చరించారు.

రోజురోజుకూ వేధింపులు తీవ్రతరం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన కానిస్టేబుల్ శ్రీను.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కాగా, కానిస్టేబుల్ శ్రీను మృతికి కారణమైన వారి విషయంలో పోలీసు శాఖ సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

#loan app#Harrasment#constable suicide#hyderabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి