తెలంగాణ

Congress : సంపాదన మంత్రులది.. ఖర్చేమో మాదా?

5 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ ఏర్పడిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను సైతం నియమించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ ఏర్పడిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను సైతం నియమించారు.కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సహకారం అందడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మంత్రుల తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు.

సంపాదన వారిది.. ఖర్చు మాకా?

మంత్రులు ఎంచక్కా సంపాదించుకుంటున్నారని, ఖర్చు మాత్రం మేం పెట్టలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కథ మళ్లీ మొదటికి వచ్చినట్టు తెలిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలకబూనినట్టు సమాచారం.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం మంత్రుల సూచనల మేరకు ఎంపిక చేశారని, అందుకే గెలుపు బాధ్యతలు సైతం వారికే అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

గెలుపు బాధ్యతలు మంత్రులకే ఇవ్వండి

దీంతో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గెలుపు బాధ్యతలతో పాటే ఎన్నికల ఖర్చులు కూడా మంత్రులే భరించాలని చెబుతున్నారు. తాము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని తేగెసి చెబుతున్నారు. అభ్యర్థులు తమను గెలిపించాలని, ఎన్నికల్లోసహకారం అందించాలని కోరుతున్నా ఎమ్మెల్యేల నుంచి ఆశించిన సహకారం లేదనే చర్చ జరుగుతోంది.

దీంతో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు దూరం అయినట్టు సమాచారం. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందనే భావనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ అమలు కాకపోవడం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, అందుకే తాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టంచేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఉద్యోగులకు మరో మూడు డీఏలు పెండింగ్, కొత్త పీఆర్సీపై స్పష్టత లేక ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ రామ్మెహన్ రెడ్డి (మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్) రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (నల్గొండ – ఖమ్మం – వరంగల్) బరిలో నిలిచారు. వచ్చే ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నట్టు చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.అందుకే మంత్రులకే గెలుపు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది. కాగా, ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక కోఆర్డినేటర్లను, ఇన్‌చార్జ్ మంత్రులను నియమించి ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.

#Congress mla's#ministers#Telangana#graduate mlc elections#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి