National

NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం హైవేపై టాయిలెట్ల పరిశుభ్రతపై ఫిర్యాదు చేస్తే రూ.1000 విలువైన FASTag రీఛార్జ్‌ను ఉచితంగా మీరు గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా NHAI ప్రత్యేకంగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపెయిన్‌ను తాజాగా వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది.

NHAI: నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం హైవేపై టాయిలెట్ల పరిశుభ్రతపై ఫిర్యాదు చేస్తే రూ.1000 విలువైన FASTag రీఛార్జ్‌ను ఉచితంగా మీరు గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా NHAI ప్రత్యేకంగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపెయిన్‌ను తాజాగా వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది.

ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 429 మంది ప్రయాణికులు రూ.1000 చొప్పున ఉచిత FASTag రీఛార్జ్ పొందినట్లు తాజాగా NHAI వెల్లడించింది. అయితే ఈ రివార్డ్ పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పింది. ఇంతకీ అవి ఏంటో తెలుసా..

నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న టైంలో టోల్ ప్లాజా వద్ద ఉన్న టాయిలెట్లు అపరిశుభ్రంగా కనిపిస్తే వెంటనే వాటిని ఫొటో తీసి ఫిర్యాదు చేస్తే చాలు. చెత్తగా ఉండటం, పరిశుభ్రత లేకపోవడం వంటి అంశాలను మీరు తీసే ఫొటోలో స్పష్టంగా కనిపించేలా తీసి పంపాలి. మీరు పంపించిన ఫొటోను అధికారులు పరిశీలించి అది నిజమని నిర్ధారిస్తే, మీ కార్‌తో కనెక్ట్ అయిన FASTagకు ఫ్రీగా రూ.1000 రీఛార్జ్ చేస్తారు.

అయితే ఒక్క వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌పై ఈ రివార్డ్‌ను ఒక్కసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి రివార్డ్ తీసుకున్న తర్వాత అదే వాహనంతో మళ్లీ క్లెయిమ్ చేయడం కుదరదు. అలాగే ఈ రీఛార్జ్‌ను మరో వ్యక్తికి బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం కూడా సాధ్యం కాదు. ఒకే టాయిలెట్‌కు సంబంధించి ఒకేసారి పలువురు ఫిర్యాదులు చేస్తే.. ఫస్ట్ కంప్లైంట్ చేసిన వ్యక్తికే రివార్డ్ అందుతుంది.

ఇలా ఫిర్యాదు చేయండి..

ఈ రివార్డ్ పొందాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ Rajmargyatra యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* మీ మొబైల్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ అవ్వాలి.

* టోల్ ప్లాజా వద్ద క్లీన్‌గా లేని టాయిలెట్‌ను గుర్తించాలి.

* ఆ టాయిలెట్‌కు సంబంధించిన జియో-ట్యాగ్డ్, టైమ్‌స్టాంప్ ఉన్న ఫొటో తీయాలి.

* యాప్‌లో ఫొటోను అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి.

* ఫిర్యాదు సమయంలో మీ పేరు, టోల్ ప్లాజా లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.

* మీరు పంపిన ఫొటోలను తొలుత AI సాయంతో స్క్రీనింగ్ చేస్తారు.

* అనంతరం NHAI సిబ్బంది వాటిని మాన్యువల్‌గా పరిశీలిస్తారు.

* ఫిర్యాదు నిజమని నిర్ధారణ అయితే మీ వాహనానికి లింక్ అయిన FASTagలో రూ.1000 రివార్డ్ రీఛార్జ్ చేస్తారు.

ప్రతి టాయిలెట్‌కు ఈ ఆఫర్ వర్తించదు!

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. హైవేపై కనిపించే ప్రతి టాయిలెట్‌కు ఈ రివార్డ్ వర్తించదు. NHAI నేరుగా నిర్వహించే లేదా NHAI పరిధిలో ఉన్న టాయిలెట్లకు మాత్రమే ఈ క్యాంపెయిన్ వర్తిస్తుంది. పబ్లిక్ ప్రదేశాలు, పెట్రోల్ బంకులు, దాబాలు తదితర ప్రైవేట్ ప్రదేశాల్లో ఉన్న టాయిలెట్ల ఫొటోలను పంపితే ఈ రూ.1000 రివార్డ్ పొందే అవకాశం మీకు ఉండదు. అందువల్ల నేషనల్ హైవేపై ప్రయాణించే సమయంలో NHAI పరిధిలోని టోల్ ప్లాజా టాయిలెట్ అపరిశుభ్రంగా కనిపిస్తే.. ఫొటో తీసి Rajmargyatra యాప్ ద్వారా ఫిర్యాదు చేసి రూ.1000 FASTag రివార్డ్ పొందొచ్చు.

#NHAI#National Highways Authority of India#NHAI Clean Toilet Challenge#Clean Toilet Picture Challenge#FASTag#Rs 1000 FASTag Reward#FASTag Recharge#Rajmargyatra App#Highway Toilets#National Highways#Toll Plaza#Highway News#NHAI Rules#NHAI Campaign#Travel News#Road Safety
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి