సినిమా

NBK 111: ఆన్‌సెట్స్ నుంచి బాలయ్య లుక్ రివీల్!

రచన: Anshu3 నిమిషాల పఠనం

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, రాజ్యలక్ష్మి కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఆన్‌సెట్స్ లో ఉన్న బాలయ్య లుక్ రిలీజైంది. ఇలా, బాలయ్య లుక్ వచ్చిందో లేదో అలా వైరల్ అయింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇంతకముందు బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' సినిమా వచ్చి మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, వాస్తవానికి ఈ సినిమా కథ ముందు అనుకున్నది వేరే. బాలయ్య రెండు పాత్రలకి సంబందించిన లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్స్ అందరికీ ఎంతగానో నచ్చాయి.

కానీ, బడ్జెట్ కారణంగా ఆ కథను పక్కన పెట్టి, మరో కథతో సినిమా పట్టాలెక్కింది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వాస్తవానికి, అన్నీ అనుకున్నటు గనక పూర్తైతే దసరా బరిలో గోపీచంద్-బాలయ్య సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ, కాకినాడ షూటింగ్ సమయంలో బాలయ్యకి గాయమై దాదాపు రెండు నెలలపాటు ఆలస్యం అయింది. మళ్ళీ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇక, తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ ఒకటి వదిలారు. గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య విశ్వరూపం చూడబోతున్నామని ఇటీవల వదిలిన టీజర్‌తో హింట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య సెట్స్‌లో జాయిన్ అయ్యాడు కాబట్టి, డిసెంబర్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరిలో ఎన్‌బికే 111 వచ్చేస్తుందంటున్నారు. కాగా, కాజల్ అగర్వాల్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.

#balakrishna#nbk111#gopichand malineni#nayanthara#kajal aggerwal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి