రాజకీయాలు

BRS : కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో భారీ స్కాం : కేటీఆర్

4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ ఎత్తిపోతల పథకం టెండర్ల కేటాయింపు ప్రక్రియలో భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్ జరిగిందని, టెండర్ల అలాట్ మెంట్ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ ఎత్తిపోతల పథకం టెండర్ల కేటాయింపు ప్రక్రియలో భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్ జరిగిందని, టెండర్ల అలాట్ మెంట్ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ కీలక పోస్టు పెట్టారు.

పొంగులేటికే ధారాదత్తం..

‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం మంత్రి కంపెనీ మాత్రమే దరఖాస్తు చేసుకుందని, పోటీలో ఉన్న మిగిలిన సంస్థలన్నీ కేవలం కాగితాలకే పరిమితమైన "డమ్మీ కంపెనీలు" అని విమర్శించారు. రేసులో ఒక్కరే పరుగెత్తి గెలిచిన చందంగా ఈ టెండర్ల సెటప్ ఉందని ఆరోపించారు. ప్రారంభంలో దాదాపు రూ.1,450 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏకంగా 5 రెట్లు పెంచి రూ.6,825 కోట్లకు చేర్చారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట మళ్లిస్తున్నారే తప్పా, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ప్రజలకు చుక్క నీరు కూడా అందించలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ వనరులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయన్ను ట్యాక్ చేస్తూ పోస్టు పెట్టారు. క్రోనీ క్యాపిటలిజం, పగటిపూట దోపిడీ, క్లెప్టోక్రసీ అనే పదాలు కూడా కాంగ్రెస్ నేతల దోపిడీ ముందు చాలా చిన్నవి అయిపోతున్నాయని విమర్శించారు. ‘ఈ దోపిడీని వర్ణించడానికి దయచేసి ఏదైనా కొత్త పదాన్ని వెతకడంలో నాకు సహాయం చేయండి రాహుల్ గాంధీ గారూ’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

#KTR#kodangal lift irrigation#Big Scam#funds missuse#diversion#revanthreddy#ponguleti srinivas reddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి