సినిమా

Tollywood: మెగావర్స్‌లో "మనం" హీరోలు..

4 నిమిషాల పఠనం

Tollywood: ఇంతకాలం మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి మూడవ సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 10తో నాగ్ బిజీగా ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ కూడా సినిమాలు చేస్తూనే ఆహా కోసం అన్‌స్టాపబుల్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ దిగ్గజ ఓటీ కోసం 'మెగావర్స్' పేరుతో 15 ఎపిసోడ్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే, కొన్ని ఎపిసోడ్స్ షూట్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.

'మనం' హీరోలతో మెగావర్స్ ఫస్ట్ ఎపిసోడ్:

'మనం' సినిమా అంటే గుర్తొచ్చేది అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకూ అందరూ కళ్ళ ముందు మెదులుతారు. అలాంటి, అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌లతో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ ఎపిసోడ్ షూట్ కూడా కంప్లీట్ అయిందని..చైతూ విషయంలో సోషల్ మీడియాపై నాగ్ మండిపడినట్టు..ఎంట్రీలో చిరు-నాగ్ కలిసి డాన్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

మెగా హీరోలతో మెగావర్స్:

మెగాస్టార్ హొస్ట్‌గా వ్యవహరిస్తున్న మెగావర్స్ మెగా ఎపిసోడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి సందడి చేయబోతున్నట్టుగా కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. చిరు, చరణ్, పవన్ కలిసి ఒక ఎపిసోడ్‌లో అలరించనున్నారట. పవన్ సినిమాలతో పాటు రాజకీయ ప్రస్థానం.. చరణ్ సినిమాల గురించి మాత్రమే కాకుండా మరికొన్ని హిడెన్ టాపిక్స్ కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

కమెడియన్స్‌తో క్రేజీ ఎపిసోడ్:

లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం, సునీల్, సత్యలతో చిరు మెగావర్స్ ఎపిసోడ్ నవ్వులతో నిండిపోయిందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కూడా షూట్ పూర్తైనట్టుగా సమాచారం. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో ఈ షోకి సంబందించిన షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, మెగాస్టార్ మొదలుపెడుతున్న మెగావర్స్ ఎంటర్‌టైనింగ్ టాక్ షో ఇప్పుడున్న షోలను బీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

#Megaverse#Megastar Chiranjeevi#Nagarjuna#Naga Chaithanya#Akhil
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి