తెలంగాణ

TG : రెవెన్యూశాఖలో పందికొక్కులు.. భూభారతి మాటున ఎకరాలకు ఎకరాలే మాయం?

5 నిమిషాల పఠనం

తెలంగాణలో అమాయక రైతు తనకు తెలియకుండానే భూములను కోల్పోతున్నాడు. గతంలో ధరణి మాటున సాగిన అక్రమ భూ దందా.. ఇప్పుడు భూభారతి మాటున కొనసాగుతోంది. రాత్రికి రాత్రే ల్యాండ్ ఓనర్ షిప్ మారిపోతుండటం భూ యజమానులను విస్మయానికి గురిచేస్తోంది.

తెలంగాణలో అమాయక రైతు తనకు తెలియకుండానే భూములను కోల్పోతున్నాడు. గతంలో ధరణి మాటున సాగిన అక్రమ భూ దందా.. ఇప్పుడు భూభారతి మాటున కొనసాగుతోంది. రాత్రికి రాత్రే ల్యాండ్ ఓనర్ షిప్ మారిపోతుండటం భూ యజమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ తతంగం వెనుక రెవెన్యూ శాఖ అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.22ఏ నిషేధిత భూముల జాబితా అక్రమార్కులకు వరంలా మారింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు సైతం కాసులకు కక్కుర్తి పడుతుంటంతో మధ్యలో అన్నదాతలు,భూ యజమానులు ఆగం అవుతున్నారు.

భూభారతి కాదు.. భూహారతి..

22ఏ ను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి రూ. లక్షల నుంచి కోట్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.తాజాగా ఉదాహరణ రెవెన్యూ అధికారుల భూ దాహాం, దోపిడీకి నిలువుటద్దంలా నిలుస్తోంది. వీరికి అధికార పార్టీ నుంచి ఎవరో నేతలు సాయం చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. లేదంటే రెవెన్యూ అధికారులు ఇంత ధైర్యం ఎలా చేస్తారు? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 8లో నిషేధిత జాబితాలో ఉన్న 11.33 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఒక్కొక్కరి పేరిట 2.31 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు పాస్‌బుక్కులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సర్వే నంబర్ 8/5లోని 2.31 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.91 లక్షలకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే భూమిని తిరిగి నిషేధిత జాబితాలోకి మార్చి, భూమి విలువను రూ.35.29 కోట్లకు పెంచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాత్రికి రాత్రే ఓనర్ షిప్ మాయం

మరుసటి రోజు ఆ భూమి విలువను ఎకరాకు రూ.1.19 కోట్లకు పెంచగా.. మార్కెట్ వర్గాలు అదేంటని గట్టిగా నిలదీయడంతో కాసేపటికే రూ.60.90 లక్షలకు తగ్గించినట్టు సమాచారం. కోర్టు కేసులు ఉన్న భూమిలో కలెక్టర్ అనుమతులు లేకుండా అధికారులు భూభారతిలో మార్పులు ఎలా చేశారని, దీని వెనుక అధికార పార్టీ నాయకులు లేకుండా ఇంతటి సాహసానికి పాల్పడే అవకాశమే లేదని విమర్శలు వస్తున్నాయి.

అయితే సర్వే నంబర్ 8/Aలో తనకు వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల 4 గుంటల భూమిని కనీసం తనకు తెలియకుండానే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని చింతల మురళీధర్ రెడ్డి అనే బాధితుడు వాపోతున్నాడు.ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.అయితే,ఈ అక్రమ భూదందాను రెవెన్యూ అధికారుల వెనుక ఉండి గుట్టుచప్పుడు కాకుండా నడిపించిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అనే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.

#bhu-bharati#revenue officers#land scams#rangareddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి