క్రైమ్

Crime : హైదరాబాద్‌లో దారుణం.. శునకంపై లైంగికదాడి!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

నేటి సమాజంలో మనుషులకే కాదు వీధి కుక్కులకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మహిళలు, మైనర్లపై లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్న క్రమంలో తాజాగా జంతువులపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

నేటి సమాజంలో మనుషులకే కాదు వీధి కుక్కులకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మహిళలు, మైనర్లపై లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్న క్రమంలో తాజాగా జంతువులపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ లైంగికవాంఛను తీర్చుకోవడానికి సమాజం అసహ్యించుకునే పనులకు పూనుకుంటున్నారు. గతంలోనూ ఇలాంటి కొన్ని ఘటనలు జరిగాయి. మనుషులు ఇంతలా దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

వీధి శునకాలను కూడా వదలని వ్యక్తులు.. ఒంటరిగా అమ్మాయిలు, మహిళలు,చిన్నారులు కనిపిస్తే వదిలేస్తారా? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వారిని కఠినంగా శిక్షలు విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.జంతు ప్రేమికులు సైతం ఈ విషయంలో తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన శిక్షలు విధించాలని పెట్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకివెళితే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని సాయినగర్‌లోని మెఫెయిర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ తివారీ (50) అనే వ్యక్తి వీధి శునకంపై లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం .ఈ నెల 8వ తేదీన అపార్ట్‌మెంట్ ఆవరణలో తిరిగే ఒక ఆడ కుక్కను శాలువలో బంధించి తన సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.

సీసీ ఫుటేజీలో ఆ దృశ్యాలు రికార్డు అయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై సమాచారం అందుకుని, వివరాలు సేకరించిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సిబ్బంది సైతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

#street dog#sexual assalt#hyderabad#kompalli#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి