క్రైమ్

HYD : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ పోర్టులోని డిపాచర్ సెక్షన్‌లో నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుంది.అనుమానంతో వారి బ్యాగులను స్కానింగ్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్య గదుల వలే ర్యాక్స్ ఏర్పాటు చేసి దాచిన విదేశీ కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ నగదు విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.56 కోట్లు ఉంటుందని అంచనా.

తనిఖీల్లో పట్టుబడిన ప్రయాణికుడి నుంచి రూ.63.62 లక్షల విలువైన విదేశీ నగదు లభించగా, అతనితో పాటు ఉన్న మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.91.94 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఇంత భారీ మొత్తంలో నగదును విదేశాలకు తరలిస్తుండటంతో కస్టమ్స్ చట్టం కింద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ భారీ నగదు తరలింపు వెనుక హవాలా దందా ఏమైనా ఉందా? దీని వెనుక ఎవరున్నారు? ఈ నగదును ఎక్కడి నుంచి సేకరించి ఎవరికి చేరవేయడానికి తీసుకెళ్తున్నారు? అనే కోణంలో డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు వేదికగా ఇటీవలి కాలంలో డ్రగ్స్, బంగారం, విదేశీ మద్యం భారీగా పట్టుబడుతోంది.

#foriegn currency#shamshabad airport#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి