స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ఎన్ని లక్షల కోట్లు అయితే సరిపోతాయి సర్?

రచన: Swechaanews Chairman•••10 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు ముగియకముందే అవినీతిపై ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏ శాఖలో చూసినా డబ్బులు తప్ప, మన డ్యూటీ మనం చేశామా అనే ఆలోచన ఏ ఒక్క ఉద్యోగికి లేదు. అందులో సీఎం నిర్వహించే శాఖలో కొట్టొచ్చినట్లు అనేకం కనిపిస్తున్నాయి. హెల్ప్ చేసిన వాళ్లకు దోచిపెడుతున్న సంఘటనలు చూస్తే ఇదేం పాలన, ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నట్లుగా ప్రజాస్వామ్య వాదులకు అనిపిస్తోంది.

  • పైసల కోసం గాడి తప్పుతున్న పాలన?

  • ఆనాడు ఏడేళ్లకు?.. ఈనాడు మూడేళ్లు నిండకముందే?

  • ఏ శాఖలోనైనా ముక్కుపిండి వసూలు చేయడమే పని?

  • డీజీపీ హెచ్చరించినా మారని పోలీస్ సిస్టమ్?

  • బ్లాక్ మెయిల్ కోసం బాడీ టెస్ట్ చిన్న ఉదాహరణే?

  • బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో కోట్లు తీసుకున్న పోస్టింగ్?

  • అక్రమ అనుమతులకు ఓసీలు

  • నీళ్లు లేవని బాసరలో సెలవు ఇచ్చిన తీరు?

  • అన్ని కమీషన్స్ సరిపోలేదని బొగ్గుపై లేని శ్రద్ధ బూడిదను సైతం వదలలేని పరిస్థితి?

  • 22ఏ పేరుతో బ్రోకర్స్ దందా ఏంటో తెలుసుకోండి?

  • ఆనాడు యశోద హస్పిటల్‌కు దోచిపెడితే, ఇప్పుడు ఏకంగా మెడికోవర్‌నే ఏలుకున్నారు?

  • మాఫియాల ఆగడాలను బయటపెడితే.. ఆనాడు రఘు, ఇప్పుడు శంకర్

  • మారింది ఏంటో చెబితే సంతోషిస్తాం రేవంత్ రెడ్డి

  • రాజకీయం కోసం కూడబెట్టుకుంటే ప్రజలు పట్టించుకోరు

  • దోపిడీ పాలిటిక్స్ భవిష్యత్ అంటే పుట్టెడు ఆధారాలు పుట్టుకొస్తాయి?

  • ఆగమవుతున్న అడ్మినిస్ట్రేషన్‌పై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809.

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు ముగియకముందే అవినీతిపై ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏ శాఖలో చూసినా డబ్బులు తప్ప, మన డ్యూటీ మనం చేశామా అనే ఆలోచన ఏ ఒక్క ఉద్యోగికి లేదు. అందులో సీఎం నిర్వహించే శాఖలో కొట్టొచ్చినట్లు అనేకం కనిపిస్తున్నాయి. హెల్ప్ చేసిన వాళ్లకు దోచిపెడుతున్న సంఘటనలు చూస్తే ఇదేం పాలన, ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నట్లుగా ప్రజాస్వామ్య వాదులకు అనిపిస్తోంది.

మెడికోవర్ మీది కాదా?

కేసీఆర్ ప్రారంభించారు. కిషన్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. నేను ప్రారంభిస్తే నాది అవుతుందా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, అందులో డైరెక్టర్స్ మెడికల్ మాఫియాకు నిదర్శనం. ఆనాడు కేసీఆర్ సొంత కులానికి దోచిపెట్టేలా ఒక్క యశోదనే బతికేలా చేసి 300 శాతం లాభాలకు తీసుకొచ్చారు. దాన్ని ఫారెన్ కంపెనీలకు అమ్ముకుని వైట్ చేసుకున్నారు. అలానే, మీరు 2019 నుంచే బీజాలు వేసుకుని ఉన్నారు. దాన్ని అమ్ముకున్నది వాస్తవం. వైట్‌గా మార్చుకుని మీ కూతురు స్కూల్స్‌కి మళ్లించుకున్నది కరెక్ట్‌యే? డైరెక్టర్స్ పేర్లు, మారిన కంపెనీల గురించి ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో కొంచెం ఓపిగ్గా చూస్తే కనిపిస్తోంది. ఇదే మెడికల్ మాఫియా ఆనాడు ఓ మహిళ మృతిపై నిజాలు ఏంటో చెప్పితే తొలివెలుగు రఘుపై కేసులు పెట్టించి, ఎక్కడికి దారి తీసిందో తెలుసు. ఇప్పుడు మీ కుటుంబ కంపెనీ కాదని చెప్పినా నమ్మలేని ఆధారాలు స్వేచ్ఛ న్యూస్ వద్ద ఉన్నాయి. ఇప్పటికే అందరికీ చేరాయి. కాని జర్నలిస్టులను అరెస్ట్ చేయించడం మొదలు పెట్టారు. ఆ మాఫియా చేసిన మెడికల్ తప్పిదాలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి శంకర్‌ని అరస్ట్ చేస్తే ఏం వస్తుంది. అంతా అర్థం చేసుకోలేమా?

ఏసీబీ పట్టుకుని ఆధారాలు ఇచ్చినా మీరు ఏం చేశారు?

హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ నిరూపించే ప్రయత్నం చేసింది. అందుకు వివిధ ప్రాజెక్ట్‌ల్లో లంచాలు తీసుకున్నారని స్టేట్మెంట్ స్వయంగా ఒప్పుకున్న రికార్డులు ఉన్నాయి. అరవింద్ కుమార్‌కి ఇచ్చిన డబ్బులు, ఆయన ఉంచుకున్న సొమ్ముతో ఆధారాలు ఇచ్చినా మళ్లీ డ్యూటీలో పెట్టుకున్నారు. కోకాపేట్‌లో టైటిల్ లేని భూమికి, వందల ఎకరాల లే అవుట్‌లో 6 వేల గజాల పార్క్ ప్లేస్‌ని, 12 వేల గజాల రోడ్లను కబ్జా చేసి 13 అంతస్థులు కడితే దానికి 2026, సెప్టెంబర్ 9న హెచ్ఎండీఏతో ఆక్యూపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ భూ స్కాంలో ఎవరి పాత్ర ఉందో ఆధారాలతో సహా స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి వార్తలు ఇచ్చారు. మీ దృష్టికి తీసుకొచ్చారు. కానీ, కాసుల కక్కుర్తికి ఇలాంటి ఎన్నో క్లియర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతున్నారు.

నీళ్లపై కనీసం దృష్టి పెట్టలేదు

దసరా వరకు వర్షాలు పడే తెలంగాణలో రెండు నెలల క్రితమే ముఖం చాటేశాయి మేఘాలు. ప్రపంచం అంతా ఎల్‌నినో అంటూ హెచ్చరిస్తున్నా, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువగానే వర్షపాతం పడినా నీళ్ల కరువుపై ఇప్పుడు మేల్కొన్నారు. ఈ నీళ్ల మాటున జరిగిన కాంట్రాక్టుల వ్యవహారం చాలానే ఉంది. బనకచర్ల, పొతిరెడ్డిపాడు, కుంగిన కాళేశ్వరం, దేవాదుల వద్ద దిగువకు వెళ్లిన నీళ్లు అనేకంగా ఉన్నాయి. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.

ఎన్ని శాఖలు నిజాయితీగా పని చేస్తున్నాయో చెప్పండి

ఒక్క ఏసీబీ తప్ప, ఏ శాఖలోని అధికారులు ప్రజలను పట్టించుకోవడం లేదు. పోలీస్ శాఖ పనితీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. సివిల్ కేసుల్లో డబ్బులు ముట్టకపోతే వదలడం లేదు. డయల్ 100కి ఫోన్ చేసినా బాధితుల వద్ద నుంచి 500 తీసుకోలేనిది కదలడం లేదు. ఇలా ఇటీవల శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో మైనర్ బాలిక అంటూ ఫిర్యాదు అందినా, అందరూ కాంప్రమైజ్ అనుకున్నా, పోలీసులు డబ్బుల కోసం సర్టిఫికేట్ అంటూ బాడీ టెస్ట్ చేశారు. ఆనాడు బండి సంజయ్ కుమారుడి విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎన్ని డబ్బులు బ్లాక్‌మెయిల్ చేశారో శాఖ పరంగా విచారణ జరపండి.

నీళ్లు లేవు.. కరెంట్ పరిస్థితి ఏంటో తెలియదు?

బయటకు భట్టి విక్రమార్క కరెంట్ పైన బాగా పని చేస్తున్నారని చెప్పుకున్నా, ఊళ్లలో ఉండే సబ్ స్టేషన్ రికార్డులు చూస్తే తెలుస్తుంది ఎన్ని గంటలు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నారో. నిజానికి ఇలా ఇవ్వడం వలనే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గకుండా ఉంటున్నాయి. కానీ, పంటలు ఎండిపోవడం విచారకరం. బొగ్గు నిల్వలు 10 రోజులకు మించి లేవు. ఎన్నో దందాల నడుమ వ్యవస్థను నడిపిస్తున్నారు. కానీ, అదే బూడిదను ఎత్తుకెల్లేందుకు సిండికేట్ చేసే లోసుగులతో ఒకే కంపెనీకి 3 ఏండ్లు కట్టబెట్టడంపై విమర్శలు ఉన్నాయి. వాటి సంగతేంటి?

ఏ శాఖలో కరెక్ట్ ఉందో చెప్పండి ?

వ్యవసాయ శాఖ దండుగా, రెవెన్యూ శాఖ మొత్తం వాళ్ల సొంత రెవెన్యూ పైనే పడింది. మీ శాఖల్లో షాడోలు రాజ్యమేలుతున్నారు. ఆరోగ్యంలో అంతులేని నిర్లక్ష్యం. తెలియని దోపిదీ. చెప్పాలంటే ఒక్కటా రెండా? మూడేళ్లు నిండకముందే అవినీతి, అక్రమాలు, అధికారుల అలసత్వం అనేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి. దోచుకున్న డబ్బులు మాత్రమే గెలిపించలేవు. ఆధారాలు కావాలంటే చాలా ఉన్నాయి.

#RevanthReddyAdministration#SwetchaNewsSpecial#TelanganaScams2026#MedicalMafiaTG#HMDA13FloorsScam#RegionalNewsTelugu#investigationstory
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి