Health

Health: కళ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

కళ్లు మసకగా కనిపించడం చాలామంది సాధారణ సమస్యగానే భావిస్తారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

కళ్లు మసకగా కనిపించడం చాలామంది సాధారణ సమస్యగానే భావిస్తారు. కానీ తరచూ ఇలా జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపు పవర్ మారడం వల్ల దూరం లేదా దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపించకపోవచ్చు.. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రెస్బయోపియా వల్ల కూడా దగ్గర చూపు మసకబారవచ్చు.

అలాగే కంప్యూటర్, మొబైల్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి డ్రై ఐ, కంటి మంట, అలసట, తాత్కాలికంగా మసక చూపు రావచ్చు. స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పలు తక్కువగా కొట్టడం కూడా కంటి పొడిబారడానికి కారణమవుతుంది. మరో ముఖ్యమైన కారణం డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి లెన్స్‌లో ద్రవ మార్పులు జరిగి తాత్కాలికంగా చూపు మసకబారవచ్చు.

ఇక దీర్ఘకాలంలో అధిక షుగర్ కంటి వెనుక భాగంలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీసి డయాబెటిక్ రెటినోపతికి దారితీయవచ్చు. ఈ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే కంటి చూపును కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

రక్తంలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం, పొగతాగడం మానేయడం, పోషకాహారం తీసుకోవడం, కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కసారిగా చూపు మసకబారడం, ఒక కంటిలో అకస్మాత్తుగా చూపు తగ్గడం, కాంతి మెరుపులు కనిపించడం, ఒక్కసారిగా ఎక్కువ ఫ్లోటర్స్ రావడం, కంటి నొప్పి వంటి లక్షణాలు ఉంటే అత్యవసరంగా కంటి వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కొన్ని తీవ్రమైన కంటి సమస్యలకు హెచ్చరిక సంకేతాలు కావచ్చు. కాబట్టి మసక చూపును కేవలం కళ్ల అలసటగా భావించకుండా, కారణాన్ని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా చూపును కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Eyes#Blood sugar#blood pressure#cholesterol; computers#mobile phones#digital screens
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి