Gopichand: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఇప్పుడు విలన్‌గా కూడా ఛాన్స్ తీసుకుంటున్నారు. 100 సినిమాలు చేసిన శ్రీకాంత్ చాలా కాలంగా విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పిస్తున్నాడు. ఇటీవల డా.రాజశేఖర్ కూడా బలమైన పాత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. హీరో అని కాకుండా మంచి రోల్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ లిస్ట్‌లో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా చేరితే బావుంటుందని చెప్పుకుంటున్నారు.
గత కొంతకాలంగా గోపీచంద్ కి సరైన హిట్ దక్కడం లేదు. ఒకప్పుడు, శంఖం..శౌర్యం..గోలీమార్..యజ్ఞం..సాహసం లాంటి సినిమాలతో హిట్ అందుకున్నాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. అయినా, కూడా గోపీచంద్ సినిమాలకి మంచి ఆదరణ దక్కింది. అయితే, పక్కా కమర్షియల్..సీటీమార్ సినిమాల ఫ్లాప్ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది ఈ మ్యాచో స్టార్‌కి. ప్రస్తుతం, రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
అయితే, ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఘాజీ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ "భరత వర్ష" అనే పీరియాడికల్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా 7వ శతాబ్ధం నాటి సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం సరికొత్త మేకోవర్‌తో రెడీ అయ్యాడు. అయితే, ఈ మూవీ నుంచి ఎప్పుడో 'అమ్మ కదిలి వచ్చే' అనే పాట వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.
ఈ సినిమాతో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ దర్శకత్వంలో 'సింగ' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూసి పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా అని అర్థమైంది. కానీ, ఈ సినిమా నుంచి కూడా మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో, గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమాలు ఇలా ఆలస్యం అయితే, మార్కెట్ దెబ్బతింటుందని ఇండస్ట్రీలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, హీరో వేషాల కోసమే ఎదురుచూడకుండా..ఆ కటౌట్‌కి సాలీడ్ విలన్ పాత్రలు వస్తాయి. అవైతే, గోపీచంద్ కెరీర్ పర్ఫెక్ట్గా సాగుతుందని అంటున్నారు. ఇది, మాత్రం వాస్తవం. మరి, గోపీచంద్ ఈ విషయం ఎప్పుడు గ్రహించి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


