సినిమా

Vijay DevarakonDa: ఫ్లాప్స్‌తో సంబంధం లేదు..లైనప్‌లో 3 సినిమాలు

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Vijay DevarakonDa: విజయ్ దేవరకొండ ఇంకో 2 నుంచి 3 ఏళ్ల వరకూ బిజీగా ఉన్నాడు. ఆయన డైరీ డేట్స్‌తో నిండిపోయింది. తాజాగా, రణబాలి సినిమాతో వచ్చిన ఈ రౌడీ హీరో, డే 1 కలెక్షన్స్ బాగానే రాబట్టాడు. అయితే, ఎక్కువగా, ఈ సినిమాకి నెగిటివ్ టాక్, ఫ్లాప్ సినిమా అని చెప్తున్నారు. రణబాలి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అంత, రికవరీ కష్టమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇలాంటి, టాక్‌తో సంబంధం లేకుండా లైనప్‌లో మూడు సినిమాలు పెట్టాడు విజయ్.

విక్రమ్ కె కుమార్ కి గ్రీన్ సిగ్నల్:

మనం, 24, హలో, గ్యాంగ్‌లీడర్, ఇష్క్, థాంక్యూ లాంటి సినిమాలను రూపొందించాడు విక్రమ్ K కుమార్. ముఖ్యంగా, 'మనం' సినిమా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ, ఈ దర్శకుడి ఖాతాలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ సమానంగా ఉన్నాయి. గత చిత్రం 2022లో వచ్చిన థాంక్యూ. నాగ చైతన్య-రాశీఖన్నా జంటగా నటించారు. దీని, తర్వాత మళ్ళీ ఇంతకాలానికి విజయ్ దేవరకొండతో సినిమాను చేసే ఛాన్స్ అందుకున్నాడు. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందనున్నట్టుగా స్వయంగా విజయ్ వెల్లడించాడు.

సెట్స్‌పైనున్న "రౌడీ జనార్ధన":

అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా రౌడీ జనార్ధన మూవీ సెట్స్‌పై ఉంది. నిన్నా మొన్నటి వరకూ రణబాలి సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్నాడు విజయ్. ఈ సినిమా ప్రేక్షకుల ముదుకు వచ్చేసింది. ఇకపై, రౌడీ జనార్ధన సినిమా మీదే పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్‌లో ఈ మూవీ రూపొందుతోంది. రణబాలి ఫలితం తర్వాత స్క్రిప్ట్‌లో ఏమన్నా మార్పులు చేస్తారా లేదా చూడాలి.

విజయ్ దేవరకొండ మాస్ అండ్ ఫ్యామిలీ చిత్రాలను చేస్తూనే, కొత్త ప్రయోగాలకు రెడీగా ఉంటాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న విజయ్.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ ఫేమ్ దర్శకుడు శౌర్యూవ్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే, ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ లాకైంది. నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ భావోద్వేగాలతో తెరపై అద్భుతంగా చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు, శౌర్యూవ్ దర్శకత్వంలో విజయ్ అలాంటి ఎమోషనల్ సినిమాలో నటిస్తే, ఆ సినిమా ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ కాంబోపై కూడా మంచి అంచనాలున్నాయి.

#Vijay Devarakonda#Vikram K Kumar#Ravikiran Kola#Shouryuv
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి