International

అమెరికా సంచలన నిర్ణయం.. భారత్‌కు భారీ ఊరటనిచ్చిన ట్రంప్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ ఉపశమనం కల్పించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై 100శాతం వరకు భారీ సుంకాలు విధించే వివాదాస్పద ‘లిండ్సే ఓ. గ్రాహం చట్టాన్ని’ (Lindsey O. Graham Act) అమలు చేస్తూనే, అందులోని కఠినమైన నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ వైట్‌హౌస్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ కాంగ్రెస్‌కు లిఖితపూర్వకంగా ధ్రువీకరించారు.

 రష్యా చమురుపై పూర్తిగా ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అమాంతం పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లోని సెక్షన్ 4 కింద సుంకాల విధింపును తాత్కాలికంగా నిలిపివేశారు. భారత్ తన చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని రష్యా దిగుమతుల ద్వారానే భర్తీ చేస్తున్నందున, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు ఎంతో మేలు చేయనుంది.

 ఇదిలావుండగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్ 17 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ముంబైలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్దదైన గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను ఆయన సందర్శించనున్నారు. ఈ పర్యటనకు సరిగ్గా ముందు అమెరికా ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం భారత్-అమెరికా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

#USSanctionsWaiver#DonaldTrumpIndia#RussianOilImports#LindseyGrahamAct#MarcoRubioIndiaVisit#JamnagarRefinery#NationalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి