Epic Movie: తాజాగా(11/09/2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్'. 'బేబీ' సినిమాతో ఇద్దరూ మంచి పర్ఫార్మర్స్‌గా పాపులర్ అయిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా ఇది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్‌లో అద్భుతమైన సినిమా అంటూ ఊదరగొట్టారు. కానీ, సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదనేది ప్రేక్షకుల మాట.
కథ అందరికీ తెలిసిందే:
ఎపిక్ కథ గురించి చెప్పాలంటే ఎదో బుర్ర పెట్టి ఆలోచిస్తే గానీ అర్థం కాని కథ కాదు. చదువు కోసం విదేశాలకి వెళ్ళడం..అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడటం..ఈ మధ్యలో జరిగే రొటీస్ సన్నివేశాలు..ఏదో చెప్పాలనుకునే క్లైమాక్స్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ అని చెప్పడానికే తప్ప పెద్దగా ఏమీ ఆశించలేము. దర్శకుడు హీరోహీరోయిన్స్ రోల్స్ ఎందుకు రాసుకున్నాడో అర్థం కాదు.
బేబీ సినిమా జంట కదా.. అని ఏదో ఉంటుందని ఊహించుకొని వెళితే డిసప్పాయింట్ అవక తప్పదు. శివాజీ, వాసుకిల పాత్రల్లో కాస్త ఎమోషన్స్ ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ పాత్రలో రక రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బాగానే చూపించాడు. కానీ, బేబీ మూవీలో ఉన్నంత డెప్త్ మాత్రం ఈ క్యారెక్టర్‌లో మిస్ అయింది. కొన్ని సీన్స్ చాలా నటించాడు.
ఇక, వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్‌గా ఉంది. మెచ్యూరిటీ లెవల్స్ బావున్నాయి. ఆనంద్ దేవరకొండతో ఉండే ఇంటిమేట్ సీన్స్‌లో బాకా పర్ఫార్మ్ చేసి ఆకట్టుకుంది. సరైన కథ గనక పడి ఉంటే బేబీ మైలేజ్ తో బాగానే ఉండేది. కానీ, ఎపిక్ కథంతా అందరికీ తెలిసిందే. తర్వాత ఏంజరగబోతుందో థియేటర్స్‌లో ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఈ ఇద్దరికీ సరైన హిట్ పడలేదు. ఎపిక్ తో మళ్ళీ అది రిపీట్ చేద్దామనుకుంటే మరోసారి నిరాశ తప్పలేదు.









