Gopichand Malineni: మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేయాలి ఉంది. కానీ, కుదరలేదు. ఈ సారి చేసే సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి అంతకంటే పెద్ద హిట్ తీయడానికి ట్రై చేయాలని అన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలయ్యతో 'దాదా' చేస్తున్న గోపీచంద్:
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'దాదా' చిత్రాన్ని చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బ్యాలెన్స్ షూట్..ఇంకోవైపు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను చేస్తూ వస్తున్నాడు గోపీచంద్ మలినేని. అయితే, దీని తర్వాత గోపీచంద్ మలినేని ఏ హీరో సినిమా చేబోతున్నాడూ? అని చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో, తాజాగా ఆయన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా మైత్రీ వారూ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్ ని జరిపారు. ఈ కార్యక్రమానికి గోపీచంద్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మైత్రీ వారితో మరో సినిమా చేయాల్సి ఉంది..కానీ, కుదరలేదు. ఈసారి గ్యారెంటీగా చేస్తాను..ఆ సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది.
ఆ సినిమా తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి కూడా దాన్ని మించిన సినిమా తీయాలని అంటూ ఓ రకంగా టార్గెట్ పెట్టాడు. దీన్ని, బట్టి గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాను మైత్రీలో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించబోతున్నట్టుగా కూడా హింట్ ఇచ్చాడు. బహుషా 2027 ప్రథమార్థంలో ఈ క్రేజీ కాంబోలో ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. ఇక, ఇప్పటికే..గోపీచంద్ రవితేజకి డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.










