సినిమా

Dulquer Salmaan: "ఆకాశంలో ఒక తార"..మలయాళ హీరోకి హ్యాట్రిక్ దక్కేనా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Dulquer Salmaan: మలయాళంలో క్రేజీ హీరోగా నిలిచిన దుల్కర్ సల్మాన్ గత కొంతకాలంగా మన టాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కేవలం ఫోకస్ చేయడమే కాదు, ఇక్కడ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలో దుల్కర్ లేటెస్ట్ మూవీ 'ఆకాశంలో ఒక తార' సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దక్కుతుందా..అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

Dulquer Salmaan: మలయాళంలో క్రేజీ హీరోగా నిలిచిన దుల్కర్ సల్మాన్ గత కొంతకాలంగా మన టాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కేవలం ఫోకస్ చేయడమే కాదు, ఇక్కడ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలో దుల్కర్ లేటెస్ట్ మూవీ 'ఆకాశంలో ఒక తార' సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దక్కుతుందా..అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

మహానటి:

తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించిన మొదటి సినిమా మహానటి. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి ఏ స్థాయిలో హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ నటన అద్భుతం అని విమర్శకులు కూడా ప్రశంసించారు. అలా, తెలుగుతో పాటు తమిళంలో కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సీతారామం:

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా దుల్కర్ కి మరో తెలుగు స్ట్రైట్ సినిమా కావడం..ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మన మేకర్స్ దుల్కర్‌తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాస్తవానికి మన తెలుగులో ఉన్న స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే, దుల్కర్ సీతారామం చేసి హిట్ అందుకున్నాడు. అదే, ఇక్కడ అభిమానులను పెంచడానికి, అవకాశాలు రావడానికి కారణమయింది. ఇలా, రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దుల్కర్ కి మరో గోల్డెన్ ఛాన్స్ లక్కీ భాస్కర్.

నిజంగా ఈ భాస్కర్ లక్కీనే:

మన తెలుగు హీరోలకి కూడా వరుసగా ఇలా హిట్స్ దక్కలేదు. దాంతో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమాను చేసే ఛాన్స్ అందుకున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను దక్కించుకొని కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇలా, లక్కీ భాస్కర్ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. మళ్ళీ, మరో విభిన్నమైన కథాంశంతో రాబోతున్నాడు.

'ఆకాశంలో ఒక తార':

టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తై, ప్రస్తుతం డబ్బింగ్..ఇతర పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. హీరోయిన్ గా సాత్విక వీరవల్లి నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా, "ఆకాశంలో ఒక తార" సినిమా నుంచి టీజర్ వచ్చి ప్రేక్షకుల్లో అంచనాలను బాగా పెంచేసింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. నవంబర్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో, దుల్కర్ డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు. చూడాలి, మరి ఆకాశంలో ఒక తార ఎలా మెప్పిస్తుందో.

#Aakasamlo Oka Tara#Dulquer Salmaan#Pavan Sadhineni#Satvika Veeravalli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి