తెలంగాణ

దసరా సెలవుల్లో కూల్చివేతలకు బ్రేక్.. తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దసరా పండుగ సెలవుల వేళ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, ఆస్తులపై దసరా సెలవుల సమయంలో ఎలాంటి కూల్చివేతలు గానీ, బలవంతపు చర్యలు గానీ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, హైడ్రా (HYDRAA) అధికారులకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం దిశా నిర్దేశం చేసింది.

 ఈ ఆంక్షలు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 25 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామానికి చెందిన శీలం లీలావతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సర్వే నంబర్ 71/4లోని తన పట్టా భూమిలో ఉన్న పశువుల కొట్టాన్ని నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేసేందుకు యత్నిస్తున్నారని ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 విచారణ జరిపిన ధర్మాసనం.. సదరు వివాదాస్పద భూమిపై యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసు విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది. విచారణ సమయంలో పలువురు న్యాయవాదులు బార్ అసోసియేషన్ తరఫున కోర్టు దృష్టికి ఒక కీలక అంశాన్ని తీసుకెళ్లారు.

 దసరా సెలవుల సమయంలో కోర్టులకు విరామం ఉండటంతో అధికారులు కూల్చివేతలకు పాల్పడితే బాధితులు న్యాయపరమైన రక్షణ పొందే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. పండుగ సెలవుల్లో ఎవరి ఆస్తులపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని, అయితే చట్టప్రకారం నోటీసులు జారీ చేయడానికి అధికారులకు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#TelanganaHighCourt#HYDRAADemolitions#DasaraVacationOrders#TelanganaRevenueDept#HighCourtInterimOrder#KhammamChinthagudem#TelanganaNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి