Kollywood: గత కొన్ని నెలల నుంచి సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)సీఈఓ అయిన కావ్యా మారన్, కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మ్యూజిక్ సెన్షేషన్‌గా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట వివాహం చేసుకోబోతున్నారని కూడా ఈ మధ్యకాలంలో పొలోమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే, ఈ వార్తలకు ఇప్పుడు చెక్ పడింది. తాజాగా, కావ్యా, అనిరుధ్ ఒకటి కాబోతున్నట్లుగా కావ్య మారన్ తండ్రి, అగ్ర నిర్మాత కళానిధి మారన్ ప్రకటించాడు. ఈ పెళ్లి వేడుక యూరప్‌లో జరుగబోతుంది. ఇక, ఈ నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్ ఎంతో వైభవంగా జరగనుంది. కాగా, ఈ వేడుకకు సంబంధించిన వివాహ మరియు రిసెప్షన్ల ఆహ్వాన పత్రికల అందజేత కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాజాగా ఆయన నివాసంలో కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించడంతో ఇటు రాజకీయ, అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అంతేకాదు, ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. అలాగే, చెన్నైలో నవంబర్ 21న రిసెప్షన్ జరగనుంది. ఇక కావ్య-అనిరుష్ల పెళ్ళి ఈ నవంబర్ 11న గ్రీస్‌లో అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందట. ఇంకా, దీనిపై ఇంకా, అధికారిక ప్రకటన వెరావాల్సి ఉంది. వ్యాపార రంగంలో దిగ్గజ కుటుంబానికి చెందిన కావ్యా మారన్, సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి క్రేజ్‌తో ఉన్న అనిరుధ్ ఈ వివాహబంధంతో ఒక్కటవుతుండటం గొప్ప విశేషం. ప్రస్తుతం, ఈ వార్త అంతటా ట్రెండ్ అవుతోంది.


