సినిమా

SS.Rajamouli: వారణాసి టార్గెట్ వాళ్ళేనా? రాజమౌళి ప్లాన్స్ మారిపోయాయ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

SS.Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇంతకాలం చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే, ఇప్పుడు చేస్తున్న గ్లోబల్ మూవీ వారణాసి ఒక్కటే ఒకెత్తు. దాదపు 1400 కోట్ల భారీ బడ్జెట్. 120 దేశాలలో రిలీజ్ ప్లాన్. 50 భాషలలోకి తీసుకెళ్ళాలన్న తపన. ఇదంతా ఒక్క రాజమౌళి మాత్రమే చేస్తోన్న క్రేజీ ప్లాన్. అయితే, బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకి తీసుకోని టెన్షన్..వారణాసి మూవీకి తీసుకుంటున్నాడు జక్కన్న. అందుకే, ముందు ప్రపంచదేశాలను టార్గెట్ చేశాడు.

వారణాసి సినిమా మన ఇతిహాసాలు, పురాణాలు, మైథలాజికల్ కథాంశాంలతో రూపొందిస్తున్నాడు రాజమౌళి. కానీ, ఆయనకి బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన క్రేజ్ వల్ల ఈసారి టార్గెట్ హాలీవుడ్‌ను చేశాడు. అయితే, వారణాసి సినిమా మొదలైనప్పుడు రాజమౌళికి ఈ ప్లాన్ ఉందా లేదా తెలియదు గానీ..ఇప్పుడు మాత్రం 120 దేశాలనే ఏకంగా టార్గెట్ చేసి ముందుగా అక్కడ ఆడియన్స్, మీడియా వర్గాలలో బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ డైరెక్టర్ చేయనటువంటి సాహసం వారణాసి సినిమాతో రాజమౌళి చేస్తుండటం గొప్ప విశేషం. ఈ దెబ్బతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత స్టామినా ఉన్న మన ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి. ఇక్కడ, ఆయన బృందం సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్, ఆర్.ఆర్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. రాజమౌళి, మాత్రం ప్రపంచదేశాలలో వారణాసి సినిమాను ప్రమోట్ చేస్తూ మేకింగ్ సమయంలో జరిగిన అనుభవాలను పంచుతూ హైప్ క్రియెట్ చేస్తున్నాడు.

ఈ ఏడాది చివరకి వరకూ రాజమౌళి టార్గెట్ హాలీవుడ్ ఆడియన్సే. ఆయన అనుకున్న 120 దేశాలలో ఏకకాలంలో వారణాసి మూవీపై హైప్ క్రియెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పలు ఇంటర్వ్యూస్, పాడ్‌కాస్ట్, మ్యాగ్జైన్ కోసం స్పెషల్ స్టోరీస్ ప్లాన్ చేశాడు. అక్కడ, ఫుల్ బిజీగా ఉన్నాడు. 2027, జనవరి నుంచి మన ఇండియాలోని అన్నీ రాష్ట్రాలలో..సౌత్ అండ్ నార్త్‌లోని అన్నీ భాషలలో వారణాసి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓన్లీ ప్రమోషన్స్ కోసమే 60 నుంచి 70 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. అవసరమైతే 100 కోట్ల వరకైనా ఖర్చు చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ రెడీగా ఉంది. ప్రపంచదేశాల నుంచి ఓవరాల్‌గా వారణాసి సినిమా కలెక్షన్స్ టార్గెట్ 5000 కోట్లని అంచనా వేస్తున్నారు.

#SS Rajamouli#Varanasi#Super Star Mahesh Babu#Priyanka Chopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి