క్రైమ్

స్పై కెమెరా కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి.. పోలీసుల అదుపులో భక్తుడు!

4 నిమిషాల పఠనం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపేలా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిఘా కెమెరాలు అమర్చిన ప్రత్యేక 'స్పై కెమెరా కళ్లజోడు' (Spy Camera Spectacles) ధరించి పుణెకు చెందిన ఓ భక్తుడు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపేలా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిఘా కెమెరాలు అమర్చిన ప్రత్యేక 'స్పై కెమెరా కళ్లజోడు' (Spy Camera Spectacles) ధరించి పుణెకు చెందిన ఓ భక్తుడు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సదరు భక్తుడు ధరించిన కళ్లజోడుపై అనుమానం వచ్చిన పూజారులు వెంటనే అప్రమత్తమై ఎస్పీఎఫ్ (SPF) భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణెకు చెందిన అంకేష్ అగర్వాల్ అనే భక్తుడు తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనార్థం వచ్చారు. రూ.5వేలు చెల్లించి రాహు-కేతు పూజలు కూడా నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం గర్భగుడిలోకి వెళ్తున్న సమయంలో ఆయన పెట్టుకున్న కళ్లజోడులో సీక్రెట్ కెమెరా అమర్చి ఉన్నట్లు పూజారులు గమనించారు. ఆలయ నిబంధనల ప్రకారం గర్భగుడిలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, కెమెరాలను అనుమతించరు.

 అయినప్పటికీ ఈ స్పై కెమెరా కళ్లజోడుతో ఆయన సెక్యూరిటీ చెకింగ్ దాటుకుని లోపలికి ఎలా వెళ్లారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పూజారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది అంకేష్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ కళ్లజోడుతో వీడియోలు రికార్డ్ చేసేందుకు ప్రయత్నించారా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 రాహు-కేతు పూజ సమయంలోనూ, అమ్మవారి ఆలయ గర్భగుడిలోనూ ఆయన ఏమైనా వీడియోలు లేదా ఫొటోలు తీశారా అనేది తేల్చేందుకు ఆ కళ్లజోడులోని డేటాను పరిశీలిస్తున్నారు. ఇటీవల శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన మరువక ముందే, సరిగ్గా 24గంటలు గడవకముందే ఈ భద్రతా ఉల్లంఘన ఘటన జరగడం భక్తులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయ ప్రధాన ద్వారాల వద్ద తనిఖీలు నిర్వహించే భద్రతా సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

#SrikalahastiTempleSpyCamera2026#AnkeshAgarwalPuneSrikalahasti#SpyCameraGlassesTirupatiDistrict#SrikalahastiTempleSecurityLapse#APNewsTelugu#CrimeNewsTelugu#TirupatiNewsTelugu#RegionalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి