Tollywood: OG 2 కంటే ముందే అనిల్ రావిపూడితో పవన్ సినిమా ఉండబోతుందా..! ప్రస్తుతం, ఇదే లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దిల్ రాజు, పవన్ కళ్యాణ్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన వకీల్ సాబ్ మంచి హిట్ సినిమాగా నిలిచింది. దీంతో, మరోసారి దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా డేట్స్ కూడా ఇచ్చాడు పవన్.
ఇక, దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజుకి కూడా మంచి అనుబంధం ఉంది. అనిల్ రావిపూడి దిల్ రాజుకి సాలీడ్ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. దీంతో, అనిల్ రావిపూడి ఎప్పుడు కథతో సిద్ధంగా ఉన్నా దిల్ రాజు నో అనే ప్రసక్తే లేదు. అంతేకాదు, దిల్ రాజు ఇంతకముందే అనిల్ రావిపూడికి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట. అయితే, తాజా సమాచారం మేరకు అనిల్ రావిపూడి-పవన్ కళ్యాణ్ కాంబోని సెట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
గతకొంతకాలంగా ఏడాదికో సినిమాను తీసుకువచ్చి భారీ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరారు. దిల్ రాజుకి ఈ సినిమా మంచి లాభాలను తెచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు కూడా 300 కోట్ల క్లబ్లో చేరింది. సుష్మిత, సాహు గారపాటిలకి మంచి లాభాలు వచ్చాయి.
ఇప్పుడు, వెంకటేష్-కళ్యాణ్ రామ్-కీర్తి సురేష్-కృతి శెట్టిలతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న జనవరి 12 విడుదల 2027, సంక్రాంతికి రాబోతుంది. దీని, తర్వాత దిల్ రాజు బ్యానర్లో పవన్ కళ్యాణ్ సినిమా ఉండే అవకాశాలున్నాయట. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్‌ని దృష్టిలో పెట్టుకొని జెట్ స్పీడ్‌లో సినిమాను పూర్తి చేసే దర్శకుడు కావాలి. అలాంటి, దర్శకుల్లో ఇప్పుడు హిట్ మిషన్ అనిల్ రావిపూడి ముందున్నాడు. అందుకే, ఓజీ 2 కంటే ముందు పవన్ కళ్యాణ్-అనిల్ రావిపూడి-దిల్ రాజుల సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూడాలి, మరి ఈ కాంబో నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.


